Donald Trump : బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ విమర్శనాస్త్రాలు.. నేనుంటే ఇజ్రాయెల్‌పై దాడి జరిగేది కాదు!

Donald Trump : తాను ప్రెసిడెంట్‌గా ఉండి ఉంటే ఇజ్రాయెల్‌పై దాడి జరిగేది కాదని చెప్పుకొచ్చారు ట్రంప్. అక్టోబర్‌ 7న జరిగిన మారణహోమంపై ప్రెసిడెంట్ జోబైడెన్‌ను ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు.

Donald Trump : గాజాలో పరిస్థితులను బైడెన్‌పై విమర్శనాస్త్రాలుగా వాడుకుంటున్నారు యూస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. గాజాపై దాడిని ఆపడంలో ఫెయిల్ అయ్యారంటూ ప్రస్తుత అధ్యక్షుడి తీరును తప్పుబట్టారు. తాను ప్రెసిడెంట్‌గా ఉండి ఉంటే ఇజ్రాయెల్‌పై దాడి జరిగేది కాదని చెప్పుకొచ్చారు ట్రంప్. అక్టోబర్‌ 7న జరిగిన మారణహోమంపై ప్రెసిడెంట్ జోబైడెన్‌ను ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు.

Read Also : Mumbai Richest City : బీజింగ్‌ను అధిగమించి.. ఆసియాలోనే సంపన్న నగరంగా ముంబై..!

బైడెన్ మాట్లాడలేరని..ఆయన విదేశాంగ విధానం కూడా భయానకంగా ఉందని తప్పుబట్టారు ట్రంప్. బైడెన్‌ను హమాస్ గౌరవించదని.. అందువల్లే ఈ దాడి జరిగిందన్నారు. ఇజ్రాయెల్‌కు బైడెన్ శ్రేయోభిలాషి అయ్యుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని విమర్శలు చేశారు.

వెంటనే యుద్ధాన్ని ముగించాలంటూ పిలుపు :
ఇజ్రాయెల్‌ను కూడా అప్రమత్తం చేశారు ట్రంప్. గాజా నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు విషాదకరంగా ఉన్నాయని..వాటిని ప్రపంచం చూస్తోందని.. అందుకే ఈ యుద్ధాన్ని ముగించాలని సూచించారు. గాజా విషయంలో ఇజ్రాయెల్ దూకుడు తగ్గకపోవడంతో అంతర్జాతీయంగా మద్దతు తగ్గుతుందని హెచ్చరించారు.  ప్రపంచదేశాల మద్దతు కోల్పోతుండటంతో జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్‌కు సూచించారు.

మరోవైపు గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌కు అమెరికా దూరంగా ఉంది. దీంతో అమెరికాపై కోపంగా ఉంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో శాంతియుత వాతావరణం ఏర్పడేలా అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

Read Also : China Teen Zhou Chuna : అభిమాన నటిలా కనిపించాలని 100కు పైగా ప్లాస్టిక్ సర్జరీలు.. రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన యువతి

ట్రెండింగ్ వార్తలు