అగ్రరాజ్యం అధ్యక్ష్య డు ట్రంప్ కు ఆరోగ్యానికి ఏమైంది ? ఏదైనా వ్యాధితో బాధ పడుతున్నారా ? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే..నీళ్లతో ఉన్న గ్లాసు పట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఆయన ఆరోగ్యంపై సరికొత్త సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
2020, జూన్ 13వ తేదీ శనివారం యూఎస్ సైనిక అకాడమీలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్నారు. మధ్యలో దాహం కావడంతో పక్కనే ఉన్న మంచినీటి గ్లాసును పట్టుకున్నారు. తాగేందుకు ప్రయత్నించార. కానీ ఇబ్బందులు పడ్డారు. గ్లాసును పైకెత్తి తాగేందుకు ఎడమ చేతిని సాయంగా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రాష్ట్రాల పర్యటన సందర్భంగా..కొంత అలసటకు గురి కావడం వల్లే..కొంత ఇబ్బందికి గురయ్యారని అంటున్నారు. దీనిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగా లేదని అంటున్నారు.
అమెరికాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అంతకంతకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం అమెరికన్లు సరిగ్గా నిద్రకూడా పోవడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మహమ్మారి కారణంగా లక్షలాది మంది బలయ్యారు. అధికంగా వయస్సు పై బడిన వారే ఉండడం గమనార్హం. 21 లక్షల మందికి కరోనా వైరస్ సోకిందని సమాచారం. 1.17 లక్షల మంది బలయ్యారని టాక్. 11.70 యాక్టివ్ కేసులున్నాయని తెలుస్తోంది.