థియేటర్లు రీ ఓపెన్ చేస్తానంటోన్న ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన ప్రకటన చేశారు. సినిమా థియేటర్లను మరి కొద్ది రోజుల్లోనే ఓపెన్ చేయనున్నామని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా యూఎస్ ఎకానమీపై పెను ప్రభావం చూపించిన లాక్‌డౌన్ ఆర్థిక నష్టం నుంచి తేరుకోవాలని ఈ ప్లాన్ చేశారట. ఇది సినిమా థియేటర్ ఓనర్లకు తీపికబురే కావొచ్చు. కరోనా మాట వినిపించగానే ముందు మూసేసింది థియేటర్లే.

థియేటర్లు రీ ఓపెన్ చేస్తానంటోన్న ట్రంప్

Updated On : August 16, 2022 / 10:57 AM IST

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన ప్రకటన చేశారు. సినిమా థియేటర్లను మరి కొద్ది రోజుల్లోనే ఓపెన్ చేయనున్నామని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా యూఎస్ ఎకానమీపై పెను ప్రభావం చూపించిన లాక్‌డౌన్ ఆర్థిక నష్టం నుంచి తేరుకోవాలని ఈ ప్లాన్ చేశారట. ఇది సినిమా థియేటర్ ఓనర్లకు తీపికబురే కావొచ్చు. కరోనా మాట వినిపించగానే ముందు మూసేసింది థియేటర్లే.

పెద్ద సినిమాలన్నీ ఆగష్టులోనే రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. యూనివర్సల్ కామెడీ ద కింగ్ ఆఫ్ స్టేటెన్ ఐలాండ్(జూన్ 19) వార్నర్ బ్రదర్స్(సైఫై థ్రిల్లర్) టీనెట్ (జులై 17)న, డిస్నీ లైవ్ యాక్షన్ ములాన్ (జులై 24), వార్నర్ బ్రదర్స్ కామిక్ బుక్ అడ్వంచెర్ వండర్ ఉమెన్ 1984(ఆగష్టు 14)లు సమ్మర్ బ్రేక్ తర్వాత రిలీజ్ కానున్నాయి. ట్రంప్ ఈ ప్రకటన చేసిన తర్వాత థియేటర్ యాజమాన్యాలు జులై కంటే ముందుగానే థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటుననారు.

ఈ రీ ఓపెన్ అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ థియెటర్ ను బట్టి సమయం మారుతుంది. వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న న్యూయార్క్, న్యూ జెర్సీ లాంటి ప్రాంతాల్లో మరి కొంతకాలం లాక్‌డౌన్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ‘న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ కచ్చితంగా ఎక్కువ సమయం తీసుకుంటాయని బాక్సాఫీస్ విశ్లేషకుడు జెఫ్ బాక్ అంటున్నారు. కానీ, వీటి ఓపెనింగ్ మాత్రం ఏదో బిగ్ బ్లాక్ బాస్టర్ తో జరుగుతుందని అనుకోవడం లేదు.

భారీ బడ్జెట్ తో రెడీ అయిన సినిమాలు ఈ సమయంలో రిలీజ్ అయితే కష్టాలు తప్పవు. అమెరికాలోని భారీ మార్కెట్ ఉండే ప్రాంతాలు ఓపెన్ చేసినప్పటికీ లిమిటెడ్ సీటింగ్ ను మాత్రమే అనుమతిస్తారు. వ్యాక్సిన్ కనుగొనేంత వరకూ సేఫ్టీ సూచనలు మీరొద్దంటూ ఆంక్షలు పెడుతున్నారు. సినిమా టిక్కెట్లు కూడా చాలా తక్కువ మొత్తంలోనే అమ్ముతారని అంటున్నారు.

అమెరికాలో సినిమాల ద్వారా భారీగానే ఆధాయం వచ్చిపడుతుంది. అదే ఉద్దేశ్యంతోనే భారీ బడ్జెట్ కేటాయించి సినిమాలు రెడీ చేశారు. ఒకవేళ లిమిటెడ్ సీటింగ్ కెపాసిటీతో అనుమతులిస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఏదైనా ప్రాణం కంటే ఎంటర్‌టైన్మెంట్ ఎక్కువ కాదు కదా. ఓపెన్ చేసేదెప్పుడో సినిమా థియేటర్లకు వెళ్లి కూర్చొనేదెవరో ట్రంప్‌కే తెలియాలి మరి.

Also Read | Netflix, Amazon Prime Video, Disney+ Hotstarలలో స్పెషల్ షోలు