Trump Vs Biden : నేనే..గెలిచా..కాదు..నేనే

  • Publish Date - October 2, 2020 / 06:15 AM IST

Trump Vs Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికలు (America) దగ్గర పడుతున్నాయి. దీంతో అక్కడ పొలిటికల్ హీట్ నెలకొంది. అధ్యక్ష పదవికి ట్రంప్ (Trump), బైడెన్ (joe biden) పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్‌ను డెమోక్రాట్లు అధికారికంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.



అమెరికా ఎన్నికల ప్రకారం..ముందుగా.. తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ జరుగుతుంది. మంగళవారం జరిగిన ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో ట్రంప్, బైడెన్‌ హోరాహోరీగా మాటలయుద్ధం చేసుకున్నారు. డిబెట్ పూర్తయిన అనంతరం తామే గెలుచామని ఇరువురు అభ్యర్థులు ప్రకటించుకున్నారు.



అయితే..డిబేట్‌లో తమ అభ్యర్ధే గెలిచినట్లు డెమొక్రాట్లు ప్రకటించుకున్నారు. చర్చలో బైడెన్‌ ప్రమాదకరమైన ఎజెండాను తాను బయటపెట్టానని ట్రంప్ చెప్పుకున్నారు. ఇన్నాళ్లు మీడియా చేయలేని పని తాను చేశానని, బైడెన్‌ 47 ఏళ్ల రాజకీయ అనైతికతను బయటపెట్టానని ట్రంప్‌ వెల్లడించారు. దేశాన్ని నడిపేందుకు బైడెన్‌ అత్యంత బలహీనమైన వ్యక్తిగా అభివర్ణించారాయన. ప్రస్తుతం డిబెట్లను రద్దు చేసుకోవాలని బైడెన్ కు డెమొక్రాట్లు సూచిస్తున్నారని, అతనిది వామపక్ష ఎజెండా అని విమర్శించారు. మిగిలిన రెండు డిబేట్ల కోసం తాను ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.



ఎన్నికల్లో ఓటమి తథ్యమని తెలిసుకొన్న ట్రంప్‌ ప్రజల్లో ఎన్నికల చట్టబద్ధతపై
దీనిపై జో బైడెన్ స్పందించారు. అనుమాన బీజాలు నాటేందుకు యత్నిస్తున్నారని జో బైడెన్‌ ఆరోపించారు. ఏ ఒక్క అధ్యక్షుడు చేయలేని పని ట్రంప్ చేస్తున్నారని విమర్శించారు. రెండో డిబేట్‌ ఈ నెల 15న జరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు