Turkey Syria Earthquake : భూకంప విలయం.. టర్కీ, సిరియాలో 9,600 దాటిన మృతుల సంఖ్య

టర్కీ, సిరియాలో ప్రకృతి ప్రకోపానికి చనిపోయిన వారి సంఖ్య గంట గంటకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 9వేల 600గా ఉంది.

Turkey Syria Earthquake : టర్కీ, సిరియాలో ప్రకృతి ప్రకోపానికి చనిపోయిన వారి సంఖ్య గంట గంటకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 9వేల 600గా ఉంది. ఈ మేరకు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. టర్కీలో 7వేల 108 మంది.. సిరియాలో 2వేల 500మంది మృతి చెందారు. ఇంకా శిథిలాల కిందే వేలాది మంది జనం ఉన్నారు. ప్రాణాలతో ఉన్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ డెడ్ బాడీలు బయటపడుతున్నాయి.

టర్కీలోని అరిక్యా జిల్లాలో తల్లీబిడ్డలను కాపాడింది రెస్క్యూ టీమ్. రెండు రోజుల పాటు శిథిలాల కింద ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. సిరియాలో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు చిన్నారులను కాపాడారు సిబ్బంది. భవనాలు కుప్పగా కూలిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. టర్కీలోని కోటి 30లక్షల మందిపై భూకంపం ప్రభావం పడింది.

Also Read..Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

టర్కీలోని శిథిలాల కింద చిక్కుకున్న ఓ బాలుడిని కాపాడారు రెస్క్యూ సిబ్బంది. అంతకుముందు అతడు దాహం అనగా, ఓ వ్యక్తి వాటర్ బాటిల్ క్యాప్ తో నీళ్లు తాగించాడు. ఈ దృశ్యాలు గుండెలు తాకేలా ఉన్నాయి. అయ్యో పాపం అని అంటున్నారు. ఆవేదనతో అందరి హృదయాలు బరువెక్కాయి.

Also Read..Turkey-Syria Earthquakes : టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. రంగంలోకి భారత్ తోపాటు పలు దేశాల రెస్క్కూ టీమ్స్

మరోవైపు భూకంప విలయంతో తీవ్ర కష్టాల్లో ఉన్న టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ సహా పలు ప్రపంచ దేశాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల కోసం బృందాలను పంపాయి. బాధితులకు అవసరమైన మందులు, ఆహారం కూడా పంపించాయి. కాగా, వరుస ప్రకంపనలతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో రెస్క్యూ టీమ్ బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు