Turkey-Syria Earthquakes : టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. రంగంలోకి భారత్ తోపాటు పలు దేశాల రెస్క్కూ టీమ్స్

వరుస భూకంపాలు టర్కీ, సిరియాలను బెంబేలెత్తిస్తున్నాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. భూకంపంతో తీవ్ర కష్టాల్లో ఉన్న టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ తోపాటు పలు దేశాలు రంగంలోకి దిగాయి.

Turkey-Syria Earthquakes : టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. రంగంలోకి భారత్ తోపాటు పలు దేశాల రెస్క్కూ టీమ్స్

turkey earthquakes

Turkey-Syria Earthquakes : వరుస భూకంపాలు టర్కీ, సిరియాలను బెంబేలెత్తిస్తున్నాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఎక్కడ చూసిన శవాల గుట్టలే దర్శనమిస్తున్నాయి. భూకంపంతో తీవ్ర కష్టాల్లో ఉన్న టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ తోపాటు పలు దేశాలు రంగంలోకి దిగాయి. వరుస ప్రకంపనలతో సహాయక చర్యలు ఆటకాలు ఎదురవుతున్నాయి. భారత్ నుంచి ఎన్ డీఆర్ఎఫ్ బృందాలతో రెస్క్యూ టీమ్స్ ప్రజలను రక్షించేందుకు రంగంలోకి దిగాయి. టర్కీ, సిరియాలకు ప్రత్యేక విమానాల్లో భారత్ మెడిసిన్స్ పంపించింది.

వైద్య సేవలకు కావాల్సిన ఔషధాలు, శిథాలను తొలగించేందుకు ఉపయోగపడే పరికరాలు, సుక్షిత జాగీలను కూడా భారత్ పంపించింది. గజియా బాద్ కోల్ కతా నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టర్కీ, సిరియాకు చేరుకున్నాయి. స్థానిక యంత్రాంగానికి కావాల్సిన సహాయాన్ని ఈ బృందాలు అందించేలా సమన్వయ ఏర్పాట్లు పూర్తి చేశారు. 30 బెడ్స్ తో ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎక్స్ రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, పాడియాక్ మానిటర్ల వంటి వాటిని వైద్య బృందాలు తీసుకెళ్లాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

Earthquakes 7800 Died : టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. 7800 దాటిన మృతుల సంఖ్య

భారత తక్షణ సాయానికి టర్కీ, సిరియా దేశాలు కృతజ్ఞతలు తెలిపాయి. భూకంపాల దెబ్బ నుంచి టర్కీ, సిరియా దేశాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపిండం లేదు. ఎటు చూసినా భవన శిథిలాల గుట్టలే అక్కడి కనిపిస్తున్నాయి. రెండు రోజుల్లో పలుసార్లు భూకంపం రావడంతో వేలాది భవనాలు నేల మట్టమయ్యాయి. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 7826 దాటింది. ఒక్క టర్కీలోనే 5894 మంది చనిపోయారు. 20 వేలకుపైగా మందికి పైగా మరణించి ఉంటారని డబ్ల్యూహెచ్ వో అంచనా వేస్తోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

భవిష్యత్ లో ఇక్కడ మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు వస్తున్నాయి. భారీ భూకంపం తర్వాత చిన్నా, పెద్ద ప్రకంపనలు 200 పైగా సంభవించాయి. ఇవి సహాయక చర్యలకు ఇబ్బందిగా మారాయి. ఇక టర్కీలో మొత్తం 10 నగరాల్లోని కోటి ముప్పై లక్షల మందిపై భూకంప ప్రభావం పడినట్లు అంచనా వేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు టర్కీ ప్రభుత్వం పది రాష్ట్రాల్లో మూడు నెలలపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు.

Turkey Earthquake : 100 సార్లకుపైగా కంపించిన భూమి, టర్కీలో ఆగని భూప్రకంపనలు

బాధిుతలను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. సైన్యం రంగంలోకి దిగి తాత్కాలిక శిబిరాలు, క్షేత్రస్థాయి ఆస్పత్రులను ఏర్పాటు చేస్తోంది. షాపింగ్ మాల్స్, స్టేడియాలు, మసీదులు, సామాజిక భవనాల్లో ప్రజలు తల దాచుకుంటున్నారు. ఈస్కర్ డెరూన్ లో ఆస్పత్రి కూలిపోవడంతో భూకంప బాధితులకు వైద్యం కోసం నౌక దళం నౌకను కూడా సమీపంలోని రేవ్ కు పంపించారు. భూకంపాల ధాటికి టర్కీలో న్యూక్లియర్ ప్లాంట్ పేలినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి.

అయితే న్యూక్లియర్ ప్లాంట్ కు ఎటువంటి నష్టం కలగలేదని అధికారులు చెప్పారు. సిరియాలో భూకంపం ధాటికి వందలాది భవనాలతోపాటు రాజోలోని మిలిటరీ పోలీసు జైలు కూడా ధ్వంసమైంది. ఇదే అదనుగా భావించిన కొంతమంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అధికారులపై తిరగబడి పారిపోయారు. భూకంపంతో ఇబ్బంది పడుతున్న టర్కీ, సిరియాలకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. భారత సహాయక బృందాలు టర్కీ, సిరియాలకు ఇప్పటికే చేరుకున్నాయి.