Nusret Gokse Salt Bae Bill : సింగిల్‌ మీల్‌ రూ.1,80,000..అయినా ఆ రెస్టారెంటుకు క్యూ కడుతున్న కష్టమర్లు..ఎందుకంటే..

కొత్తగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్ సింగిల్ మీల్ కు రూ.లక్షా 80,000లు బిల్ వేసింది. అయినాసరే ఆ రెస్టారెంట్ లో ఒక్కసారి అయినా ఫుడ్ తినాలని కష్టమర్లు క్యూ కడుతున్నారు.

Turkey Stylish Chef Salt Bae Bill

Turkey Stylish Chef Salt Bae Bill: రెస్టారెంట్ కు వెళ్లి సింగిల్ మీల్ ఆర్డర్ చేస్తే బిల్లు ఎంతవుతుంది. మహా అయితే.రూ.500లు కానీ ఓ రెస్టారెంట్ లో మాత్రం సింగిల్ మీల్ కు రూ.లక్షా 80,000లు బిల్ వేశారు.అంటే అదేమన్నా బంగారంతో తయారుచేశారా ఏంటీ అని అనుకోవటానికి కూడా లేదు. అయినా సరే ఆ రెస్టారెంట్ లో ఒక్కసారైనా ఫుడ్ తినాలని కష్టమర్లు క్యూ కట్టి మరీ వెళుతున్నారు లండన్ లోని ఓ రెస్టారెంట్ కు.పోనీ ఆ రెస్టారెంట్ పెద్ద ఫేమస్ కూడా కాదు.కొత్తగా మొదలైన రెస్టారెంట్ అది. కానీ లోపల సీట్లు అన్ని ఫుల్ గా ఉంటాయి.దీంతో అక్కడికొచ్చి ఫుడ్ తినటానికి వచ్చేవారు బయట క్యూలో నిలబడి ఉండాల్సొస్తోంది. ఆ రెస్టారెంట్ లో సింగిల్ మీల్ రూ.1.80,000లు. అయినాసరే ఎంత ఖర్చైనా సరే ఆ రెస్టారెంట్‌లో ఒక్కసారైనా తిని తీరాల్సిందేనని తమ వంతు కోసం క్యూలో నిలబడి ఎదురుచూస్తున్నారు కష్టమర్లు.

Read more : Two Goggles auction : వేలానికి రెండు కళ్లజోళ్లు..ధర రూ.రూ.25 కోట్లు

లండన్‌లో కొత్తగా మొదలైన ఆ రెస్టారెంట్ పేరు నుస్ర్‌-ఇట్‌ రెస్టారెంట్‌. సింగిల్‌ మీల్‌కు 1800 పౌండ్లు భారత కరెన్సీలో రూ.1100ల పౌండ్లు, అంటే భారత కరెన్సీలో రూ.1,80,000. దీనికి కారణమేమంటే..ఆ రెస్టారెంట్‌ చీఫ్‌ చెఫ్‌ సర్వ్‌ చేస్తున్నాడు కాబట్టి. ఏంటీ అతనేమన్నా బంగారాన్ని వడ్డిస్తాడా ఏంటీ అంత కాస్ట్ అనుకోవటానికి కూడా వీల్లేదు. తన హోటల్‌ వ్యాపారాన్ని వెరైటీగా ప్రమోట్‌ చేసుకున్నాడు ఆ యజమాని.

గల్లీలో రుచికరమైన వంటలు వండే నుస్రెట్‌ గోక్‌సె.. తన హోటల్‌ వ్యాపారాన్ని వెరైటీగా ప్రమోట్‌ చేసుకున్నాడు. వెరైటీ స్టయిల్‌తో కష్టమర్లకు స్వయంగా సర్వింగ్‌ చేయటం మొదలుపెట్టాడు. ఆ వెరైటీ స్టైలే అతనికి కనీవినీ ఎరుగని రేంజ్‌లో క్రేజ్‌ క్రియేట్ చేసింది. ఈ క్రేజే అతని రెస్టారెంట్ ముందు కష్టమర్లు క్యూ కట్టేలా చేసింది. ఎంత ఖర్చైనా సరే..అతని సర్వింగ్ స్టైల్‌ను తాకిన ఫుడ్ తినాలని జనాలు క్యూ కట్టేలా చేసింది.

Read more : Two Goggles auction : వేలానికి రెండు కళ్లజోళ్లు..ధర రూ.రూ.25 కోట్లు

నుస్రెట్‌ గోక్‌సె..ప్రముఖ ఫేమస్ టర్కీ షెఫ్‌. అతను మాంసాన్ని కట్‌ చేసే తీరు.. మోచేతి మీదుగా ఇస్టయిల్‌గా సాల్ట్‌ను, మసాలాను, పెప్పర్ ను మాంసం మీద చల్లుతూ చాలామందిని ఆకట్టుకున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన నుస్రెట్‌ గోక్‌సె.. 2010-17 మధ్య చాలా దేశాలు తిరిగి పాక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. 2017లో టర్కీలోని ఓ ఇరుకుగల్లీలోని తన చిన్నిదుకాణంలో ఉన్న ఇతను.. స్టయిల్‌గా సాల్ట్‌, మసాలా చల్లే తీరు.. ‘సాల్ట్‌ బే’గా ఇంటర్నేషనల్‌ ఫేమ్‌ తెచ్చిపెట్టింది. మీమ్‌గా అతని ఫొటో బాగా పాపులర్‌ అయ్యింది.

విపరీతమైన క్రేజ్‌తో పాటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బ్రాండ్స్‌ ప్రమోటర్‌గా భారీగా డబ్బు కూడా వచ్చిపడింది అతనికి. దీంతో ప్రపంచంలోని చాలా చోట్ల లగ్జరీ రెస్టారెంట్‌లను ఓపెన్‌ చేశాడు. తాజాగా సెప్టెంబర్‌ 23న లండన్‌లో రెస్టారెంట్‌ ఓపెన్‌ చేయగా.. అందులోని సింగిల్‌ మీల్‌ తాలుకా బిల్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది.