Tuvalu Minister Message From Sea: మా దేశాలను కాపాడండీ అంటూ సముద్రంలో నిలబడి సందేశం ఇస్తున్న అతి చిన్న దేశం..

మా దేశాలను కాపాడండీ అంటూ..సముద్రంలో నిలబడి సందేశం ఇస్తోంది ఓ చిన్న దేశం..ఆ దేశం ఇచ్చే సందేశం వారి క్షేమం గురించే కాదు యావత్ ప్రాణికోటి కోసం..మనిషి మనుగడ కోసం..

Cop26 Summit..tuvalu Minister Message From Sea

COP26 Summit..Tuvalu Minister Message From Sea: సూటు బూటు ధరించిన ఓ వ్యక్తి సముద్రంలో నిలబడి ప్రసంగిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రసంగంలో అతను ఓ సందేశం ఇస్తున్నారు. అతను ఎవరో కాదు. ఓ దేశ విదేశాంగశాఖా మంత్రి. మంత్రి సముద్రంలో నిలబడి ప్రసంగించటమేంటీ? తన ప్రసంగంలో ఏం చెబుతున్నారు? ఏమిటీ సందేశం? అనే విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే అది అందరు ఆలోచించాల్సిన సందేశం..

సముద్రంలో నిలబడి సందేశం ఇస్తున్న ఆ వ్యక్తి చిన్న దేశమైన ‘తువాలు’ విదేశాంగ మంత్రి సైమన్ కోఫే. తువాలు దేశ వైశాల్యం కేవలం 25.9 చదరపు కిలోమీటర్లు మాత్రమే. జనాభా 11 వేల 792. అదేవిధంగా మొత్తం 9 ద్వీపాలు ఈ దేశ విదేశాంగ శాఖా మంత్రి కోఫె వాతావరణ మార్పులను విస్మరించడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాల గురించి..అది పర్యావరణంపైనా..తద్వారా జీవకోటిమీద మనిషిపైనా చూపించే ప్రభావం గురించి చెబుతున్నారు. తన ఈ వినూత్న విధానంతో ఈ సందేశాన్ని ప్రపంచానికి అలాగే ఐక్యరాజ్యసమితి(UN)కి సందేశం పంపాలనుకున్నారు. పసిఫిక్ ద్వీప దేశం ఎలా ఉందో తెలుపుతున్నారు. ప్ర‌పంచ దేశాలపై తువాలు దేశ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉందని..గ్లోబ‌ల్ వార్మింగ్‌ను త‌గ్గించ‌గ‌లిగితే తువాలు సుర‌క్షితంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

Read more : Cities floating on water : నీటిపై తేలియాడే నగరాలు!..యూరప్ దేశాల్లో ప్రయోగాలు, ఈ పరిస్థితులు దేనికి సంకేతాలు?!
ఐక్యరాజ్యసమితిలో గ్లాస్గో, స్కాట్లాండ్ క్లైమేట్ చేంజ్ కాప్26(COP26) సమ్మిట్ నిర్వహించారు. పలువురు ప్రపంచ దేశాధినేతలు దీంట్లో పాల్గొన్నారు. అధికారిక స్థాయిలో ఈ సమ్మిట్‌పై ఇంకా ఆన్ లైన్ లో వివిధ దేశాలు తమ ఆలోచనలు పంచుకుంటూ వస్తున్నాయి. ఇందులో తువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫే కూడా పాల్గొన్నారు. ఆయన ఐక్యరాజ్యసమితికి రికార్డ్ చేసిన సందేశాన్ని పంపాడు. అయితే, ఈ సందేశం వీడియో రికార్డింగ్ చేయడానికి ఆయన తీసుకున్న ఓ వినూత్న ఆలోచనసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మోకాలివరకూ తన ఫ్యాంట్ మడత పెట్టుకున్న తువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫే సముద్రంలో మోకాలి లోతు నీటిలో నిలబడి తన సందేశాన్ని ఇస్తూ రికార్డు చేశారు. సముద్రంలో ఒక పోడియం.. దాని వెనుక పై వరకూ ఫ్యాంట్ పైకి మడచిన కోఫే.. ఆయన వెనుక వీడియో రికార్డింగ్ సరిగా వచ్చేందుకు ఒక నీలిరంగు తెరను ఏర్పాటు చేశారు. ఈ సీన్ లో మంత్రి కోఫే తన సందేశాన్ని రికార్డ్ చేసి ఐక్యరాజ్యసమితికి పంపారు. అదే వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేయటంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

Read more :Moon resort : చుక్కలను తాకే భవనాల మధ్యలో నేలపై ‘చందమామ’ రిసార్ట్‌.. 

సైమన్ కోఫే ఈ వీడియో ద్వారా ప్రపంచంలోని వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం వేగంగా పెరుగుతోందని, దీని వల్ల తువాలు లాంటి చిన్న దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉందని సందేశంతో వెల్లడించారు. వాతావరణ మార్పులను అరికట్టడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్రమైన అదేవిధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ వీడియోను తువాలు రాజధాని ఫునాఫుటి మధ్యలో రికార్డ్ చేశారు.

Read more : Deep Dive Dubai : ప్ర‌పంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌..స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు