Moon resort : చుక్కలను తాకే భవనాల మధ్యలో నేలపై ‘చందమామ’ రిసార్ట్‌..

చందమామ రిసార్ట్స్, ఎన్నివింతలో..ఎన్నెన్ని విచిత్రాలో..చూడటానికి రెండు కళ్లు చాలవట. 735 అడుగుల ఎత్తులో..నాలుగు వేల గదులతో..ఈ భారీ రిసార్ట్స్ ని నిర్మిస్తోంది..అమెరికా.

Moon resort : చుక్కలను తాకే భవనాల మధ్యలో నేలపై ‘చందమామ’ రిసార్ట్‌..

Moon Resorts In Us (1)

Moon resort : చందమామ కంటికి కనిపిస్తాడు కాని చేతికి అందడు. కానీ నేటి ఆధునిక యుగంలో మనిషి చందమామపై కాలు పెట్టిన మానవడు ఆ నెలరాజును అందుకుంటున్నాడు. అందుకోవటమే కాదు..నింగిలోకి జాబిల్లిని నేలపైకి తెస్తున్నాడు. ఏంటీ చందమామ నేలపైకా? అని ఆశ్చర్యపోతున్నారా?నిజమేనండీ నిజమైన చందమామను కాదుగానీ..చుక్కల్లో నెలరాజుని చుక్కలనంటే భవనాల మధ్య నిర్మిస్తున్నారు. మరి అది ఎక్కడా అంటారా?అమెరికాలోని లాస్ వెగాస్ లో ‘మూన్ రిసార్ట్స్’ని నిర్మిస్తున్నారు.

ఈ చందమామ రిసార్ట్స్ లో ఎన్నివింతలో..ఎన్నెన్ని విచిత్రాలో..చూడటానికి రెండు కళ్లు చాలవట. 735 అడుగుల ఎత్తులో..నాలుగు వేల గదులతో..ఓ మినీ కాలనీలా ఉండే ఈ భారీ రిసార్ట్స్ ని నిర్మిస్తోంది అమెరికా. ఏంటీ రెక్కల విమానం ఎక్కి వెళ్లిపోదామనుకుంటున్నారా? ఆగండాగండీ..ఇది అప్పుడే కాదు వచ్చే సంవత్సరం అందుబాటులోకి రానుంది.అందాకా ఈ చుక్కలనంటే భవనాల మధ్యలో చందమామ విశేషాలేంటో తెలుసుకుందాం..

Read more : Deep Dive Dubai : ప్ర‌పంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌..స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు

చుక్కల్లో ఉండే నెలరాజు.. ఆకాశ హార్మ్యాల మధ్య చూస్తే ఎలా అనుభూతి కలుగుతుందో ఈ మూన్ రిసార్ట్స్ ని చూస్తే అలాగే అనిపిస్తుంది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ‘ మూన్‌ ’ పేరుతో నిర్మిస్తున్న ఓ భారీ రిసార్ట్‌ నమూనా చిత్రమే ఇదిగో ఇలా ఉంటుంది. పది ఎకరాల స్థలంలో 735 అడుగుల ఎత్తుతో, రూ. 36,881 కోట్లతో నిర్మిస్తున్న ఈ మూన్ రిసార్ట్‌లో 4 వేల హోటల్‌ గదులు ఉంటాయి.

Read more : India : ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం

అంతేకాదు భారీ భారీ స్మిమ్మింగ్ పూల్స్, థియేటర్లు, పియానో ​​బార్, బోటిక్‌లు, అనేక లాంజ్‌లు,5,000మంది హాజరయ్యేలా ఈవెంట్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్లు, నైట్ క్లబ్ ఇలా ఎన్నో వింతలు వినోదాలకు నిలయంగామారనుంది ఈమూన్ రిసార్ట్స్. ఇన్ని అద్భుతాలు ఉండే ఈ రిసార్ట్‌ వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నది. ఒక పెద్ద మోడల్ స్పేస్‌షిప్ కింద కూర్చుని, లైట్లు డ్యాన్స్‌ఫ్లోర్‌కి ప్రకాశించే అపురూప దృశ్యాలను చూడొచ్చు. మరి ఇన్ని విశేషాలు ఉండే ఈ మూన్ రిసార్ట్స్ ను చూడాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే.