Tankers Collide In Suez Canal
Suez Canal : ఈజిప్ట్‌లోని సూయజ్ కెనాల్‌లో బుధవారం రెండు ట్యాంకర్లు ఢీకొన్నాయి. సూయజ్ కెనాల్‌లో సింగపూర్ ఫ్లాగ్ ఉన్న బీడబ్ల్యూ లెస్మెస్, కేమాన్ దీవుల ఫ్లాగ్ ఉన్న బుర్రీ అనే రెండు ట్యాంకర్లు బుధవారం తెల్లవారుజామున ఢీకొన్నాయని షిప్ ట్రాకింగ్ కంపెనీ మెరైన్ ట్రాఫిక్ ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ తెలిపింది. (Two Tankers Collide In Suez Canal)
Cricket Legend : జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూత
షిప్, చమురు ఉత్పత్తుల ట్యాంకరును ఢీకొంది. ఈ నౌకల ఢీ గురించి సూయజ్ కెనాల్ అథారిటీ నిర్ధరించలేదు. ప్రపంచ వాణిజ్య రవాణాలో దాదాపు 12శాతం సూయజ్ కాలువ ద్వారానే సాగుతోంది. 2021వ సంవత్సరంలో బలమైన గాలులు వీయడంతో ఎవర్ గివెన్ అనే భారీ కంటైనర్ షిప్ సూయజ్ కాల్వ మీదుగా వెళుతూ జామ్ అయింది. దీంతో ఆరు రోజుల పాటు ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీనివల్ల ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగింది.