Heath Streak : జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూత

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కేన్సరుతో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతని కెరీర్‌లో 12 ఏళ్ల పాటు 65 టెస్ట్ మ్యాచ్‌లు, 189 ఓడీఐలు ఆడారు....

Heath Streak : జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూత

Zimbabwe cricket legend Heath Streak passes away

Heath Streak – Cricket Legend : జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కేన్సరుతో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతని కెరీర్‌లో 12 ఏళ్ల పాటు 65 టెస్ట్ మ్యాచ్‌లు, 189 ఓడీఐలు ఆడారు. జింబాబ్వే నుంచి 100 టెస్టు వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా హీత్ స్ట్రీక్ నిలిచారు. స్ట్రీక్ 2000, 2004 మధ్య జింబాబ్వే దేశానికి నాయకత్వం వహించారు.

Jai Ho ISRO : చంద్రయాన్ ల్యాండింగ్ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం

స్ట్రీక్ మృతి పట్ల అతని మాజీ బౌలింగ్ భాగస్వామి హెన్రీ ఒలోంగా విచారం వ్యక్తం చేశారు. (Zimbabwe cricket legend Heath Streak passes away) స్ట్రీక్ జింబాబ్వే ఆల్ రౌండర్ అని ఆయన ప్రశంసించాడు. సహచరుడిగా మీతో ఫీల్డ్‌ను పంచుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని హెన్నీ చెప్పారు. మిడిల్ ఆర్డర్‌లో స్ట్రీక్ బ్యాటింగ్ కెరీర్‌లో 1990 టెస్ట్ పరుగులు సాధించారు.

Joe Biden : సెప్టెంబర్ 7-10 తేదీల మధ్య జోబిడెన్ భారత్ పర్యటన

స్ట్రీక్ కెరీర్ 1993లో పాకిస్తాన్‌పై అతని అరంగేట్రంతో ప్రారంభమైంది. అక్కడ అతను రావల్పిండిలో తన రెండవ టెస్ట్‌లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా తనను తాను నిరూపించుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత స్ట్రీక్ జింబాబ్వే, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లతో కోచింగ్ పాత్ర పోషించారు.