UK Killer Nurse : ఏడుగురు శిశువులను హత్య చేసిన యూకే నర్సుకు జీవిత ఖైదు

ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసిన బ్రిటీష్ నర్సుకు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు జీవిత ఖైదు విధించనుంది. తన సంరక్షణలో ఉండగానే మరో ఆరుగురిని చంపేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ నర్సుకు సోమవారం శిక్ష ఖరారు కానుంది. లూసీ లెట్బీ అనే 33 ఏళ్ల యూకే నర్సు ఐదుగురు శిశువులు, ఇద్దరు బాలికలను చంపినందుకు ఆమెను కోర్టు దోషిగా నిర్ధారించింది....

UK Killer Nurse

UK Killer Nurse : ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసిన బ్రిటీష్ నర్సుకు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు జీవిత ఖైదు విధించనుంది. తన సంరక్షణలో ఉండగానే మరో ఆరుగురిని చంపేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ నర్సుకు సోమవారం శిక్ష ఖరారు కానుంది. లూసీ లెట్బీ అనే 33 ఏళ్ల యూకే నర్సు ఐదుగురు శిశువులు, ఇద్దరు బాలికలను చంపినందుకు ఆమెను కోర్టు దోషిగా నిర్ధారించింది. (UK Killer Nurse Faces Life Sentence) ఈ నర్సు యూకే చరిత్రలోనే చైల్డ్ సీరియల్ కిల్లర్‌గా నిలిచింది.

Chandrayaan 3 : అంతరిక్ష నౌక ల్యాండింగ్‌పై అంతరిక్ష వ్యూహకర్త పి కె ఘోష్ ఏం చెప్పారంటే…

ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసి, తన సంరక్షణలో ఉండగానే మరో ఆరుగురిని చంపేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ నర్సుకు సోమవారం శిక్ష ఖరారు కానుంది. (Murdering 7 Babies) 2015,2016 సంవత్సరాల మధ్య వాయువ్య ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లోని నియోనాటల్ యూనిట్‌లో వరుస శిశు మరణాల కారణంగా నర్సును అరెస్టు చేశారు.

Mexico : మెక్సికో బాజా తీరం దాటిన తుపాన్

నర్సు లెట్బీ శిశువులకు గాలితో ఇంజెక్ట్ చేయడం, వారికి పాలు ఎక్కువగా ఇచ్చిందని ప్రాసిక్యూషన్ పేర్కొంది. తమ శిశువులను హతమార్చడంతో అనుభవించిన బాధ, కోపం కోర్టు తీర్పుతో తీరిందని, తమకు న్యాయం జరిగిందని లెట్బీ బాధిత కుటుంబాలు తెలిపాయి. ప్రతి శిశువు మరణించినప్పుడు లెట్బీ షిఫ్ట్‌లో ఉన్నారని జ్యూరీకి చెప్పారు.

Onion : నేటి నుంచి ఢిల్లీలో సబ్సిడీపై ఉల్లి విక్రయం

కొందరు నవజాత శిశువులు వారి తల్లిదండ్రులు మంచాలను విడిచిపెట్టిన సమయంలోనే నర్సు వారిని హతమార్చింది. లెట్బీ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో ఆమె తన చేతి రాతతో ఉన్న నోట్ లో ‘‘నేను చెడు పనులు చేశాను’’ అని పేర్కొంది.