Onion : నేటి నుంచి ఢిల్లీలో సబ్సిడీపై ఉల్లి విక్రయం

దేశంలో ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సోమవారం నుంచి సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున టమాటాలను సబ్సిడీ ధరకు విక్రయిస్తోంది. ఇప్పుడు తాజాగా సోమవారం ఉల్లి కిలో సబ్సిడీపై 25రూపాయలకు విక్రయిస్తోంది....

Onion : నేటి నుంచి ఢిల్లీలో సబ్సిడీపై ఉల్లి విక్రయం

Onion

Onion To Be Sold At Subsidised Rate : దేశంలో ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సోమవారం నుంచి సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున టమాటాలను సబ్సిడీ ధరకు విక్రయిస్తోంది. ఇప్పుడు తాజాగా సోమవారం ఉల్లి కిలో సబ్సిడీపై 25రూపాయలకు విక్రయిస్తోంది. (Onion To Be Sold At Subsidised Rate) 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను ఉంచింది.

Chandrayaan 3 : చంద్రమామపై సేఫ్‌గా ల్యాండ్‌ పక్కా అంటున్న ఇస్రో సైంటిస్ట్‌లు..

ఈ ఏడాది బఫర్ కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. (Delhi From Today) ఢిల్లీలో బఫర్ ఉల్లిని రిటైల్ అవుట్ లెట్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయిస్తున్నట్లు ఎన్సీసీఎఫ్ ఎండీ అనిల్ జోసెఫ్ చంద్ర చెప్పారు. ఎన్సీసీఎఫ్, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఉల్లిని విక్రయించాలని నిర్ణయించారు. దేశంలోని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ధరలు పెరగకుండా ఉల్లిని సబ్సిడీపై విక్రయించనున్నారు.

Lionel Messi : చ‌రిత్ర సృష్టించిన లియోనల్‌ మెస్సీ.. అత్య‌ధిక టైటిళ్లు..

హోల్‌సేల్ మార్కెట్‌లో బఫర్ ఉల్లిని మండీ రేటుకు విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్‌లలో కిలో ఉల్లి ధర రూ. 25 సబ్సిడీ రేటుతో విక్రయిస్తున్నారు. సోమవారం నుంచి ఢిల్లీలో రిటైల్ విక్రయాలు ప్రారంభించారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల తర్వాత ఉల్లి విక్రయాలు ప్రారంభమవుతాయని అనిల్ జోసెఫ్ చంద్ర తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎన్‌సిసిఎఫ్ గత నెల నుంచి సబ్సిడీ ధరలకు టమాటాలను విక్రయిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ.250 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై కిలోకు రూ90కి విక్రయించడం ప్రారంభించింది. ప్రస్తుతం టమాటాల రాక బాగా పెరగడంతో కిలోకు రూ.40 కు విక్రయిస్తున్నారు.