Rishi Sunak Apologises: కారులో సీటు బెల్టు విషయంలో వివాదం.. క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్

బ్రిటన్ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ ప్రాజెక్టులకోసం నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం కొత్త లెవలింగ్ ఆప్ ఫండ్ ప్రకటనలను ప్రచారం చేయడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓ వీడియోను రూపొందించింది. ఈ వీడియో చిత్రీకరణ సమయంలో ప్రధాని సునక్ నిబంధనలు అతిక్రమించడం వివాదంగా మారింది.

Britan PM Rushik sunann

Rishi Sunak Apologises: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పాడు. కారులో ప్రయాణిస్తూ వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సీటు బెల్టు విషయం ఆ దేశంలో వివాదంగా మారింది. వెంటనే స్పందించిన సునక్.. నిబంధనలు అతిక్రమించినట్లు గమనించి క్షమాపణలు చెప్పారు. వాస్తవానికి బ్రిటన్‌లో కారులో ప్రయాణించే సమయంలో ప్రతిఒక్కరూ తప్పని సరిగా సీటు బెల్టు ధరించాలి. అత్యవసర వైద్యం పొందాల్సిన వ్యక్తి మినహా ప్రతీఒక్కరూ సీటు బెల్టు ధరించాల్సిందే. లేదంటే అక్కడికక్కడే జరిమానాలు వసూలు చేసే నిబంధన ఉంది. 100 పౌండ్ల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి కోర్టుకుసైతం వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు జరిమానా 500 ఫౌండ్లకు పెరుగుతుంది.

UK PM Rishi Sunak Pongal Lunch : తన స్టాఫ్‌కి అరిటాకుల్లో సంక్రాంతి విందు ఇచ్చిన రిషి సునక్

అసలు విషయం ఏమిటంటే.. బ్రిటన్ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ ప్రాజెక్టులకోసం నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం కొత్త లెవలింగ్ ఆప్ ఫండ్ ప్రకటనలను ప్రచారం చేయడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం ఓ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను చిత్రీకరణలో ప్రధాని రిషి సునక్ పాల్గొన్నారు. అయితే, వీడియో చిత్రీకరణ సమయంలో కారులో ప్రయాణిస్తూ ప్రధాని మాట్లాడారు. అతను సీటు బెల్టు పెట్టుకోకుండా వీడియో చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు సునక్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో బ్రిటన్‌లో ఈ విషయం వివాదంగా మారింది.

UK PM Rishi Sunak: నేనూ యూకేలో జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నాను: ఆ దేశ ప్రధాని రిషి సునక్

బ్రిటీష్ నిబంధనల ప్రకారం తాను చేసింది తప్పేనని గ్రహించి సునక్ క్షమాపణలు చెప్పారు. ఈ విషయంపై ప్రధానమంత్రి డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి మాట్లాడుతూ.. సునక్ తన సీటు బెల్ట్ కొద్దిసేపు మాత్రమే తొలగించాడని, అయినా తప్పు చేశానని అంగీకరించాడని, అందుకే క్షమాపణలు చెప్పారని తెలిపాడు. ప్రతిఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని ప్రధాన మంత్రి విశ్వసిస్తున్నారని సునక్ ప్రతినిధి తెలిపారు.