Ukraine: రష్యాకు దిమ్మతిరిగే షాకిచ్చిన యుక్రెయిన్.. హెలికాప్టర్ ను కూల్చేసిన సముద్రపు డ్రోన్.. వీడియో వైరల్

రష్యాకు యుక్రెయిన్ దిమ్మతిరిగే షాకిచ్చింది. చరిత్రలోనే తొలిసారిగా యుక్రెయిన్ కు చెందిన ఓ సముద్రపు డ్రోన్ రష్యాకు చెందిన హెలికాప్టర్ ను నల్లసముద్రంలో కూల్చేసింది.

Ukraine: రష్యాకు దిమ్మతిరిగే షాకిచ్చిన యుక్రెయిన్.. హెలికాప్టర్ ను కూల్చేసిన సముద్రపు డ్రోన్.. వీడియో వైరల్

Ukraine

Updated On : January 1, 2025 / 12:19 PM IST

Ukraine Drone Destroys Russian Chopper: రష్యాకు యుక్రెయిన్ దిమ్మతిరిగే షాకిచ్చింది. చరిత్రలోనే తొలిసారిగా యుక్రెయిన్ కు చెందిన ఓ సముద్రపు డ్రోన్ రష్యాకు చెందిన హెలికాప్టర్ ను నల్లసముద్రంలో కూల్చేసింది. మరోదానిని తీవ్రంగా దెబ్బతీసింది. ఇన్నాళ్లూ నల్ల సముద్రంలోని రష్యా నౌకలనే ఇవి దెబ్బతీయగా.. తొలిసారి గాల్లో ప్రయాణించే హెలికాప్టర్ పైనా దాడులు మొదలు పెట్టాయి. యుక్రెయిన్ ఇచ్చిన షాక్ కు రష్యా అలర్ట్ అయింది. రష్యా హెలికాప్టర్ ను నల్లసముద్రంలో కూల్చివేసినట్లు యుక్రెయిన్ కు చెందిన మిలటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంస్థ తమ ట్విటర్ ఖాతాలో పేర్కొంది. వీడియోనుసైతం రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ 16 సార్లు నూతన సంవత్సర వేడుకలు.. ఎలాగంటే?

యుక్రెయిన్ కు చెందిన మిలటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ షేర్ చేసిన వీడియోలో.. రష్యాకు చెందిన ఎంఐ-8 హెలికాప్టర్ ను యుక్రెయిన్ కు చెందిన మగూరా వీ5 సముద్రపు డ్రోను నేల కూలుస్తున్నట్లుగా ఉంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రకారం.. నల్ల సముద్రంలో యుక్రెయిన్ కు చెందిన సముద్రపు డ్రోన్ ను రష్యా హెలికాప్టర్ గుర్తించి దానిపై కాల్పులు జరిపింది. వెంటనే తనపై కాల్పులు జరుపుతున్నట్లు కంట్రోల్ కేంద్రానికి బోటు సమాచారం అందించింది. కొద్దిసేపటి తరువాత డ్రోన్ బోటుపై అమర్చిన మిసైల్ వేగంగా దూసుకెళ్లి రష్యా హెలికాప్టర్ ను ఢీకొట్టింది. కమ్యూనికేషన్ రేడియోలో పైలట్ ‘482 మాపై దాడి చేసింది.. కింద పడిపోతున్నాం’ అని సమాచారం పంపాడు. ఆ తరువాత కొద్ది నిమిషాలకే హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయింది. అంతేకాక మరో రష్యా హెలికాప్టర్ తీవ్రంగా దెబ్బతింది. ఇందుకు సంబంధించిన వీడియోను యుక్రెయిన్ మిలటరీ ట్విటర్ లో షేర్ చేసింది.