Russia-ukraine war : ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ పాట పాడిన యుక్రెయిన్ మిలిటరీ బ్యాండ్

యుక్రెయిన్ మిలటరీ బ్యాండ్ ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ అంటూ పాటపాడింది.

Ukrainian military band plays Do not Worry Be Happy : రష్యా యుద్ధంతో యుక్రెయిన్ శిథిల దేశంగా మారిన పరిస్థితులు చూశాం. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని విదేశాలకు వెళ్లిపోయిన వలసదారులను చూశాం. ఓ పక్క బాంబులు మోత మోగుతుంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని తలదాచుకుంటున్న విషాదకర దృశ్యాలు చూశాం. సామాన్య పౌరులు, సైన్యం ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని చూస్తున్నాం. యుద్ధం మొదలై 14 రోజులుగా ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే ప్రపంచాన్ని కదలించివేశాయి. ఈక్రమంలో యుక్రెయిన్ ఇక హాయిగా ఊపిరి పీల్చుకోనుందా? రష్యా పెట్టిన డిమాండ్లకు యుక్రెయిన్ తలవంచి ఇక యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Also read : Russia-ukraine war: దేశం వదిలిపోతున్న ప్రియురాలు..‘పెళ్లిచేసుకుందాం ప్రియా’అంటూ యుక్రెయిన్ సైనికుడి ప్రపోజ్

దీనికి నిదర్శనంగా యుక్రెయిన్ మిలటరీ బ్యాండ్ నోట ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ పాట వినిపించటంతో అది నిజమేననిపిస్తోంది. వెనుక యుక్రెయిన్ జాతీయ పతాకాన్ని పెట్టుకుని మిలటరీ బ్యాండ్ ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ అంటూ బాబీ మెక్ ఫెర్రిన్ పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

యుక్రెయిన్-రష్యా మధ్య ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిగాయి. రష్యా డిమాండ్లు చర్చల విడతలు పెరిగే కొద్దీ పెంచుతునే ఉంది. ఈ క్రమంలో రష్యా దాడులతో అతలాకుతలమైపోతున్న దేశాన్ని కాపాడుకునేందుకు అధ్యక్షడు జెలెన్ స్కీ రాజీపడాలనే నిర్ణయాలనికి వచ్చినట్లుగా పక్కాగా తెలుస్తోంది. కానీ ఇంకా రాజీ అనేది ఏర్పడడం లేదు. ఇప్పటికే యుక్రెయిన్ నుంచి 20 లక్షల మందికి పైగా ప్రజలు శరణార్థులుగా సరిహద్దు దేశాలకు తరలిపోయారని అంచనా. వేలాది ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. దీంతో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు.

Russian ukraine war : ‘పుతిన్ ను అడ్డుకోకపోతే..ఈ భూమిపై ఎక్కడా..ఎవరికీ సురక్షిత ప్రదేశం ఉండదు’: ఒలెనా జెలెన్ స్కీ

ఈ క్రమంలో రష్యా-యుక్రెయిన్ మధ్య రాజీ కుదురుతుందనే అనిపిస్తోంది ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తుంటే. ఈ క్రమంలో ప్రజలలో ధైర్యం నూరిపోసేందుకు ఉక్రెయిన్ మిలటరీ బ్యాండ్ ‘భయపడొద్దు.. హ్యాపీగా ఉండండనే’ అర్థంతో కూడిన బాబీ మెక్ ఫెర్రిన్ కు చెందిన ‘డోంట్ వర్రీ బీ హ్యాపీ’ అనే గీతాన్ని ఆలపించారు. ఐదుగురు సైనికులు మ్యూజిక్ ఇనుస్ట్రుమెంట్లను వాయిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. సైనికుల వెనుక యుక్రెయిన్ జాతీయ జెండా కూడా కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు