Russian ukraine war : ‘పుతిన్ ను అడ్డుకోకపోతే..ఈ భూమిపై ఎక్కడా..ఎవరికీ సురక్షిత ప్రదేశం ఉండదు’: ఒలెనా జెలెన్ స్కీ

రష్యా అధ్యక్షడు పుతిన్ ను అడ్డుకోకపోతే..ఈ భూమిపై ఎక్కడా..ఎవరికీ సురక్షిత ప్రదేశం ఉండదు అంటూ యుక్రెయిన్ ప్రధమ మహిళ ఒలెనా జెలెన్ స్కీ మీడియాను ఉద్దేశించి భావోద్వేపు లేఖ రాశారు.

Russian ukraine war : ‘పుతిన్ ను అడ్డుకోకపోతే..ఈ భూమిపై ఎక్కడా..ఎవరికీ సురక్షిత ప్రదేశం ఉండదు’: ఒలెనా జెలెన్ స్కీ

''no Place Will Be Safe If Putin Is Not Stopped

No place will be safe if Putin is not stopped, Ukraine First women Olena Zelenska : రష్యా బాంబుల దాడులతో యుక్రెయిన్ రోజురోజుకు తీవ్రంగా నష్టపోతోంది. ఆర్థికంగా..సామాజికంగా..నిర్మాణ పరంగా..మానవ శక్తి పరంగా ఇలా అన్ని విధాలుగా తీవ్రంగా నష్టపోతోంది. కానీ తమ డిమాండ్స్ కు యుక్రెయిన్ అంగీకరించేవరకు ఈ యుద్ధం కొనసాగుతునే ఉంటుంది రష్యా అధ్యక్షుడు పుతిన్ పదే పదే స్పష్టంచేస్తున్నారు. కానీ గత 13రోజులుగా యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంది. 10 రోజుల వరకు చాలా స్ట్రాంగ్ గా ఉన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కా దేశ పరిస్థితులను బట్టి కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది.నాటో దేశాలతో కలిసేది లేదని యుద్ధానికి కారణమైన నాటోలో తమ దేశం చేరే ఆలోచనను విరమించుకుంటున్నట్టు వెల్లడించారు. రష్యా చేసిన మరో కీలక డిమాండ్‌పైనా రాజీకి జెలెన్‌స్కీ సిద్ధమని తెలిపారు.దీంతో యుద్ధం ఆగుతుందనే అభిప్రాయాలు వస్తున్నారు.

Also read : Zelensky Compromise : రష్యాతో యుద్ధంపై యుక్రెయిన్ అధ్యక్షుడు రాజీబాట.. నాటోలో చేరేదే లేదన్న జెలెన్‌స్కీ

ఈక్రమంలో యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన యుక్రెయిన్ ఇక రష్యాతో పోరు కొనసాగించి నెగ్గలేమని తెలిసినా 13రోజులుగా పోరాడుతునే ఉంది. ఈక్రమంలో ఇక పుతిన్ కు దాదాపు సరెండర్ అయితేనే గానీ దేశం సురక్షితంగా ఉండదని యుక్రెయిన్ అధ్యక్షడు భావించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జెలెన్‌స్కీ తన అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.

ఈక్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్య, దేశ ప్రధమ మహిళ ఒలెనా జెలెన్ స్కీ మీడియాను ఉద్దేశించి భావోద్వేపు లేఖ రాశారు. ఆ లేఖలో ‘పుతిన్ ను అడ్డుకోకుంటే ఎవరికీ రక్షణ ఉండదన్నారు. ‘‘అణు యుద్ధం మొదలు పెడతానంటూ బెదిరిస్తున్న పుతిన్ ను మనం నిలువరించకపోతే ప్రపంచంలో సురక్షిత ప్రదేశం అంటూ మనకు ఉండదు’’అని ఆమె భావోద్వేగాన్ని లేఖలో వెల్లడించారు.

Also read : Pak girl thanks Modi : ‘మా ప్రాణాలు కాపాడారు’…ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన పాకిస్థాన్ బాలిక..

రష్యా స్పెషల్ ఆపరేషన్ అన్నది.. ఉక్రెయిన్ ప్రజలను సామూహికంగా హత్య చేయడమేనన్నారు. పౌరులను తాము లక్ష్యంగా చేసుకోవడం లేదన్న రష్యా ప్రకటలను తీవ్రంగా ఖండించారు. అందుకు పలు ఉదాహరణలను కూడా ఆమె తన లేఖలో ప్రస్తావించారు.

ఇంకా ఒలెనా తన తీవ్ర భావోద్వేగాన్ని వెల్లడిస్తూ..‘‘మనవరాలిని తాతయ్య కాపాడుదామని ప్రయత్నిస్తున్న సమయంలోనే ఓక్ టిక్రా వీధుల్లో ఎనిమిదేళ్ల అలైస్ చనిపోయింది. కీవ్ కు చెందిన పోలినా తన తల్లిదండ్రులతో ఉన్న సమయంలో రష్యా బాంబులకు బలైపోయింది. 14 ఏళ్ల ఆర్సేనీ తలకు శిథిలాలు తగిలి మరణించింది’’అని పేర్కొన్నారు.

రష్యా దాడులతో ఎంతో మంది ప్రజలు పిల్లలు, పెంపుడు జంతువులతో కలసి బాంబు షెల్టర్లలో, బేస్ మెంట్లలో రోజుల తరబడి తలదాచుకోవాల్సిన పరిస్థితి ప్రస్తావించారు. ధీన్ని భయానక వాస్తవంగా ఆమె అభివర్ణించారు. అత్యవసర వైద్య సాయం కూడా పొందలేని పరిస్థితులు నెలకొంది అని తెలిపారు.

Also read : Nasa Moon Photos: వేలానికి తొలి సారి చంద్రుడిపై అడుగుపెట్టిన ఫొటోలు

వేలాది మంది శరణార్థులతో రహదారులు నిండిపోయాయని.. అయిన వాళ్లకు దూరమై, ఓపిక లేని పరిస్థితుల్లో, గుండె బరువెక్కి వెళుతున్న తీరు తమకు తీవ్రంగా కలిచివేస్తున్న భావోద్వేగాన్ని ఒలెనా తన తన వ్రాత ద్వారా వర్ణించారు. తమకు మానవతా సాయం అందిస్తున్న దేశాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

‘‘యుక్రెయిన్ శాంతిని కోరుకుంటోంది. కానీ, యుక్రెయిన్ తన సరిహద్దులను, తన గుర్తింపును కాపాడుకుంటుంది. మా గగనతలాన్ని నో ఫ్లైజోన్ గా ప్రకటించండి. యుద్ధాన్ని మేము ఎదుర్కోగలం’’అని ఆమె పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో ఏమి జరుగుతుందో నిజాలను ప్రపంచానికి చూపించాలని మీడియాను ఒలెనా కోరారు.