Nasa Moon Photos: వేలానికి తొలి సారి చంద్రుడిపై అడుగుపెట్టిన ఫొటోలు

చంద్రుడిపై తీసిన తొలి ఫొటోలను నాసా వేలానికి ఉంచనుంది. చంద్రుని ఉపరితలంపై బజ్ ఆల్‌డ్రిన్ నడిచిన ఫొటోలను కోపెన్‌హాగెన్ పిక్స్ బుధవారం వేలానికి ఉంచుతారు.

Nasa Moon Photos: వేలానికి తొలి సారి చంద్రుడిపై అడుగుపెట్టిన ఫొటోలు

Nasa

Nasa Moon Photos: చంద్రుడిపై తీసిన తొలి ఫొటోలను నాసా వేలానికి ఉంచనుంది. చంద్రుని ఉపరితలంపై బజ్ ఆల్‌డ్రిన్ నడిచిన ఫొటోలను కోపెన్‌హాగెన్ పిక్స్ బుధవారం వేలానికి ఉంచుతారు.

నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తీసిన బజ్ ఆల్డ్రిన్ ఫొటోలు ఎప్పటి నా ఫేవరేట్ ఫొటోలలో ఒకటి. బజ్ ఆల్‌డ్రిన్ వైజర్ లో మీకు నీల్ ఆర్మ్‌స్ట్రంగ్ ప్రతిబింబం కనిపిస్తుంది కూడా’ అని కాస్పర్ నీల్సన్ చెబుతున్నారు.

మొత్తం 74 యూనిక్ నాసా ఫొటోగ్రాఫ్స్ అమ్మకానికి పెట్గా అందులో చంద్రుడిపై తీసినవి 26. అది కూడా 1960, 1970లలో జరిగిన అపోలో మిషన్స్‌కు సంబంధించినవే.

Read Also : ఏలియన్స్ ఆచూకీ తెలుసుకోవటానికి పూజారుల్ని నియమించుకుంటున్ననాసా..!!

‘అపోలో మిషన్ హైలెట్ ఏంటంటే. 1969 జులై 20న చంద్రుడిని తొలిసారి చేరుకోగలిగాం’ అని నీల్సన్ అంటున్నారు.

ఫారిన్ కలెక్టర్ ను కాంటాక్ట్ చేసిన బ్రూన్ రాస్మూస్సెన్ అన్ని ఫొటోలను.. లక్షా 90వేల యూరోలకు అమ్మేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. అయితే ఒక్కో ఫొటోను విడిగా అమ్ముతారట. చాలా విలువైన యూఎస్ ఆస్ట్రనాట్ తీసిన విలియం ఆండర్స్ తీసిన ఫొటో ‘ఎర్త్ రైజ్’ 1968 డిసెంబరులో 12వేల యూరోలకు వెలకట్టారు.

ఇదిలా ఉంటే చంద్రుడిపై మనిషి చివరిసారిగా 1972లో అపోలో 17మిషన్ లో భాగంగా అడుగుపెట్టాడు. కానీ, నాసా మరోసారి 2025-26లో ఆస్ట్రనాట్స్ ను తిరిగి పంపాలనుకుంటుంది.