NASA Recruiting Priests : ఏలియన్స్ ఆచూకీ తెలుసుకోవటానికి పూజారుల్ని నియమించుకుంటున్ననాసా..!!

ఏలియన్స్ ఆచూకీ తెలుసుకోవటానికి ఎన్నో యత్నాలు చేసి ఎంతో కృషి చేసిన సైంటిస్టులు తాజాగా ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఏలియన్స్ జాడ తెలుసుకోవటానికి పూజారుల్ని నియమించుకుంటోంది నాసా.

NASA Recruiting Priests : ఏలియన్స్ ఆచూకీ తెలుసుకోవటానికి పూజారుల్ని నియమించుకుంటున్ననాసా..!!

Nasa Is Recruiting Priests

NASA is recruiting priests : ఏలియన్స్ ఉన్నారా? అనే ప్రశ్న ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఏలియన్స్ జాడ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తునే ఉంది. కొంతమంది ఏలియన్స్ ను మేం చూశామని అంటారు. ఆకాశంలో ఎగిరే పళ్లాలను చూశామని వాటిపైనే ఏలియన్స్ భూమ్మీదకు వస్తున్నారనే వార్తలు వింటునే ఉంది. ఓ మహిళ అయితే ఏలియన్స్ తనను చాలాసార్లు కిడ్నాప్ చేశారని దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా చెబుతోంది. కానీ ఏలియన్స్ ఉన్నారు అనేదానికి ఎటువంటి రుజువులు లేవు. అలాగని లేరని చెప్పలేని పరిస్థితి. కానీ ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఒక చోటా ఖచ్చితంగా ఏలియన్స్ ఉండే ఉంటారని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ఈ విషయంపై సీరియస్‌గా ఉంది. ఈక్రమంలో NASA అనూహ్యంగా ఏలియన్స్ ఆచూకీ తెలుసుకోవటానికి పూజారుల్ని నియమించుకుంటోంది అనే వార్త హల్ చల్ చేస్తోంది.

Read more : James Webb Space Telescope : అంతరిక్షంలోకి టైమ్ మెషిన్..విశ్వం పుట్టుక గుట్టు విప్పే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌..

విశ్వం గుట్టు తెలుసుకోవటానికి నాసా కొన్ని రోజుల ముందు అత్యంత అధునాతన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ (james webb space telescope)ను ప్రయోగించిన విషయం విధితమే. ఈ క్రమంలో నాసా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రహాంతరవాసుల ఆచూకీ తెలుసుకోవటానికి పూజారులను నియమించకోనుంది. ఏలియన్ జాడ తెలుసుకునే మిషన్‌లో మొత్తం 24 మంది పూజారుల బృందం ఉంటుందని ప్రముఖ బ్రిటిష్ పాస్టర్ డాక్టర్ ఆండ్రూ డేవిసన్ ఈ మిషన్‌లో భాగమయ్యారు.

నాసాలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు, యూఎఫ్‌ఓల గురించి రహస్యాలకు సంబంధించిన గుట్టును విప్పే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. నాసా నియమించుకోనున్న ఆధ్యాత్మికవేత్తలు ఈ మిస్టరీలను ఛేదించటానికి నాసాకు సహాయం అందించనున్నారు. మరి ఈ పూజారుల్ని నాసా అంతరిక్షంలోకి పంపిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కేవలం ఏలియన్స్ రహస్యాలను తెలుసుకోవటానికి ఆ మిస్టరీని ఛేదించటానికి మాత్రమే నాసా 24 మంది పూజారుల సహాయం తీసుకోనుందని తెలుస్తోంది. మరో గ్రహంపై జీవం కనిపించిన తర్వాత వివిధ మతాలకు చెందిన వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నాసా భావిస్తోంది. వారు ఏఏ విషయాలు చెబుతారు? ఏలియన్స్ విషయంలో వారు ఎటువంటి విషయాలు తెలుసుకున్నారు? అనేది నాసా తెలుసుకోనుంది.

Read more : Reservoir on Mars: అంగారక గ్రహంపై భారీ రిజర్వాయర్‌..45 వేల చదరపు కి.మీటర్ల పొడవైన జలాశయం

గ్రహాంతరవాసుల జాడ కోసం సాగించే ఈ వెదుకులాట కోసం నియమించిన మిషన్‌లో 24 మంది ఆధ్యాత్మికవేత్తలు భాగంకానున్నారు. ఈ బృందంలో బ్రిటన్ ప్రసిద్ధ పాస్టర్ డాక్టర్ ఆండ్రూ డేవిసన్ కూడా ఉన్నారు. విశ్వంలో వందల బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. ప్రతి గెలాక్సీలో 100 బిలియన్ల కంటే ఎక్కువే నక్షత్రాలు ఉన్నాయి. కానీ..భూమి తప్ప మరే ఇతర గ్రహం మీద జీవం ఎందుకు ఉండదు? అనే ప్రశ్న తలెత్తుతోంది.

మరొక గ్రహంపై జీవం కోసం శాస్త్రవేత్తలు అన్వేషణ సాగిస్తునే ఉన్నారు. దేవుడి గురించి, జీవానికి సంబంధించిన మూలాల గురించి ప్రజల ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు నాసా ప్రయత్నిస్తోంది. భూమిపైనే కాకుండా ఇతర గ్రహాలపై జీవం ఉండే ఉంటుందని నాసా భావిస్తున్నది. ఈ క్రమంలోనే నాసా ఏలియన్స్‌ను జాడ కోసం ప్రయత్నిస్తోంది. మరి ప్రయత్నంలో నాసా ఎంత వరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

Read more : NASA Parker Solar Probe: సూర్యుడిని తాకిన NASA ఉపగ్రహం..అక్కడి విశేషాలు తెలుసుకుని షాకైన శాస్త్రవేత్తలు

 

Look this : https://10tv.in/web-stories/nasa-is-recruiting-priests