James Webb Space Telescope : అంతరిక్షంలోకి టైమ్ మెషిన్..విశ్వం పుట్టుక గుట్టు విప్పే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌..

ఈ అనంత విశ్వం రహస్యాలను ఛేదించటానికి మరో కీలక ఘట్టానికి తెరలేచింది. టైమ్ మిషన్ లా పనిచేస్తే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో ఈ విశ్వం గుట్టు ఛేదిస్తామంటున్నారు శాస్త్రవేత్తలు

James Webb Space Telescope : అంతరిక్షంలోకి టైమ్ మెషిన్..విశ్వం పుట్టుక గుట్టు విప్పే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌..

New Project (9)

James Webb Space Telescope  : ఈ అనంత విశ్వం రహస్యాలను ఛేదించటానికి మనిషి చేసే యత్నాలు అన్నీ ఇన్నీ కావు. నిరంతరం శ్రమిస్తు టెక్నాలజీని అవపోసన పడుతున్న మనిషి యత్నాల్లో మైలురాయి లాంటి ఘట్టం షురూ అయ్యింది. గెలాక్సీలతో పాటు మిల్కీవే మొత్తాన్ని క్షుణ్ణంగా చూడగల మెగా దర్శిని ‘జేమ్స్ వెబ్ స్సేస్ టెలిస్కోప్’ లాంఛింగ్‌కు అన్ని యత్నాలు పూర్తి అయ్యాయి. ఇక ఓ శుభ ముహుర్తాన దాన్ని లాంచ్ చేయటమే మిగిలి ఉంది. టైమ్ మెషీన్ కు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా అత్యంత అత్యాధునిక టెలిస్కోప్ సిద్ధమైంది. ఈ టెలీస్కోప్ విశేషాలు అన్నీ ఇన్నీ కావు..దీని గురించి తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇక విశ్వం అంతా కళ్లముందు సాక్షాత్కరిస్తుందినిపిస్తుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.

అమెరికా పరిశోధనా సంస్థ నాసా(NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (CSA) కలిసి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) అనే ఫ్లాగ్‌షిప్ అబ్జర్వేటరీని అభివృద్ధి చేశాయి. 1990లో రోదసీలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక హబుల్ స్పేస్ టెలిస్కోప్‌కు ఇది అంతకు మించి అన్నట్లుగా ఉంది. దీని లెవెలే వేరు అని చెప్పాల్సిందే. ఈ అత్యంత అత్యాధునిక టెలిస్కోప్‌గా త్వరలోనే అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతోంది.

Read more : Reservoir on Mars: అంగారక గ్రహంపై భారీ రిజర్వాయర్‌..45 వేల చదరపు కి.మీటర్ల పొడవైన జలాశయం

డిసెంబర్ 25న క్రిస్మస్‌ ఫెస్టివల్ సందర్భంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) ను లాంచ్ చేయడానికి నాసా రెడీ అయ్యింది. ఒక టైమ్ మెషిన్ లాగా పనిచేసే ఈ జేడబ్ల్యూఎస్‌ టెలిస్కోప్ లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో కూడా శాస్త్రవేత్తలకు తెలియజేస్తుందట. విశ్వం పుట్టుక..లక్షల సంత్సరాల నుంచి అక్కడ జరిగే చర్యలు..రహస్యాలు..ఇలా ఒకటేమిటి విశ్వం గుట్టుని అవపోసన పట్టగల సత్తా ఈ జేడబ్ల్యూఎస్‌ టెలిస్కోప్‌ కు ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. దీన్ని టైమ్ మెషిన్ అని కూడా అంటున్నారు అందుకే.ఎందుకంటే విశ్వంలో గతంలో ఏం జరిగిందో కూడా ఇది కనిపెట్టగలదట..దీన్ని టైమ్ మెషిన్ అని ఎందుకు అంటున్నారంటే..

1990లో అంతరిక్షంలోకి పంపిన హబుల్ టెలిస్కోప్‌ విశ్వంపై మన అవగాహనను పూర్తిగా మార్చేసింది. నాలుగు రోజుల్లో అంతరిక్షంలోకి వెళ్లనున్న జేడబ్ల్యూఎస్‌ టెలిస్కోపు మాత్రం విశ్వంలో ఏర్పడిన కొన్ని తొలి గెలాక్సీలను కూడా కనుగొనడానికి.. అవి ఎలా ఉనికిలోకి వచ్చాయో అర్థం చేసుకోవడానికి ఖగోళ శాస్త్రవేత్తలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనే ధీమా వ్యక్తంచేస్తున్నారు నిపుణులు. పాలపుంతతో సహా ఇతర గెలాక్సీల పుట్టుక గురించి మరిన్ని వివరాలు తెలియజేయనుందంటున్నారు.

Read more : NASA Parker Solar Probe: సూర్యుడిని తాకిన NASA ఉపగ్రహం..అక్కడి విశేషాలు తెలుసుకుని షాకైన శాస్త్రవేత్తలు

ఈ టెలిస్కో ప్ తయారీలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇన్‌ఫ్రారెడ్ తరంగదైర్ఘ్యాల వద్ద పనిచేసే జేడబ్ల్యూఎస్‌టీ ప్రాథమిక అద్దాన్ని బంగారం పూతతో 6.5 మీటర్ల వ్యాసంతో తయారు చేశారు. ఇది హబుల్ (2.4-మీటర్ల వ్యాసం) అద్దం కంటే చాలా పెద్దది. జేడబ్ల్యూఎస్‌టీ మిర్రర్ చాలా పెద్ద ప్రాంతాలను పరిశీలించి ఎక్కువ సమాచారాన్ని సేకరించగలదట.ఈ టెలిస్కోప్ తన ఇన్‌ఫ్రారెడ్ పరిశోధనతో అత్యంత దూరంలో ఉండే గెలాక్సీలలోని నక్షత్రాలను..మన గెలాక్సీలోని ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల వాతావరణాలను కూడా పరిశీలించగలదట. జేడబ్ల్యూఎస్‌టీ కాన్సెప్ట్ ఖర్చు అంచనాలకు మించి పెరిగిపోయింది. అలా ఈ టెలిస్కోప్‌ను 2007లో 500 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ప్రారంభించాలని చేసిన ప్లాన్ విఫలమైంది.

అది తిరిగి దాదాపు 10 ఏళ్ల తరువాత డిసెంబరు 2021 ప్రయోగించడానికి నాసా సిద్ధమైంది. ప్రస్తుతం దీని అంచనా వ్యయం దాదాపు 10 బిలియన్ డాలర్లు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జేడబ్ల్యూఎస్‌టీ రూపకల్పన, ఇంప్లీమెంటేషన్ దశల్లో అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటిని అధిగమిస్తు..2005లో ఒక భారీ రీడిజైన్‌ చేయాల్సి వచ్చింది. దీంతో ఖర్చు కూడా అత్యంత భారీగానే పెరిగింది.

Read more : Wuhan lab Covid-19:క‌రోనా వైరస్ పుట్టింది ఉహాన్ ల్యాబ్‌లోనే..పార్ల‌మెంట్ కు తెలిపిన కెన‌డా శాస్త్ర‌వేత్త‌ డా.అలీనా చాన్

జేడబ్ల్యూఎస్‌టీ షెడ్యూల్ ప్రకారంగా..ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ అంతరిక్ష కేంద్రం నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు (ESA) చెందిన ఏరియాన్ 5 రాకెట్‌ ద్వారా టెలిస్కోపును ప్రయోగించాలని నాసా నిర్ణయించింది. ఈ క్రమంలో ఖగోళ శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ ఔత్సాహికులు ఈ ప్రయోగం విజయవంతం అవుతుందా? లేదా? అని తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను నిర్ణీత స్థానంలో ఉంచడానికి చాలా కష్టపడాల్సి ఉంది. భూమి చుట్టూ తిరిగే హబుల్ లా కాకుండా..జేడబ్ల్యూఎస్‌టీ భూమికి దాదాపు 15,00,000 కి.మీ దూరంలో సూర్యుని చుట్టూ తిరుగాడే రెండవ లాగ్రాంజ్ పాయింట్ వద్దకు ఇది చేరుకుంటుంది.

సూర్యుడికి దూరంగా ఉంటేనే టెలిస్కోప్ అనేది విశ్వంపై అల్ట్రా-సెన్సిటివ్ పరిశీలనలను చేయగలదు. ఇది హబుల్ లా కాదు..జేడబ్ల్యూఎస్‌టీకి వ్యోమగాములు హెల్ప్ చేయలేరు. జేడబ్ల్యూఎస్‌టీ ప్రయోగం, విస్తరణ అనేది ఎటువంటి తప్పు చేయకుండా ప్రయోగించాల్సిన మోస్ట్ ఛాలెంజింగ్ అంతరిక్ష మిషన్‌లలో ఒకటి. దీంతో శాస్త్రవేత్తలు చిన్న చిన్న అంశాలపై కూడా అత్యంత క్షుణ్ణంగా దృష్టిపెట్టి అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

ప్రయోగించిన 30 నిమిషాల తర్వాత జేడబ్ల్యూఎస్‌టీ ఏరియన్ రాకెట్ నుండి విడిపోతుంది. ఆపై దాని సౌర శ్రేణులను విస్తరిస్తుంది. ఇది సూర్యుని చుట్టూ తిరుగాడే రెండవ లాగ్రాంజ్ పాయింట్ ఎల్2(L2) వైపు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి అవసరమైన శక్తిని సరఫరా చేస్తుంది. జేడబ్ల్యూఎస్‌టీ దాని మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, టెలిస్కోప్‌ను చల్లగా ఉంచడానికి అవసరమైన సూర్య కవచాలు విస్తరణను ప్రారంభిస్తాయి. అప్పటికీ ఈ టెలిస్కోప్ పూర్తిగా తెరుచుకోదు.

Read more : Tejas Express : న్యూస్ పేపర్, వాటర్ బాటిల్ కోసం రూ. 20 ఇవ్వాలి…రైల్వే మంత్రికి కంప్లైంట్

లాంచ్ అయిన ఒక వారం తర్వాత, సూర్య కవచాలు పూర్తిగా టెన్నిస్ కోర్ట్ అంత పెద్ద పరిమాణంలో విస్తరిస్తాయి. రెండు వారాల తర్వాత తన మడతలన్నీ విప్పార్చుకుని 6.5-మీటర్ల వ్యాసం కలిగిన ప్రైమరీ మిర్రర్ (బంగారు అద్దం) బయటికి వస్తుంది. లాంచ్ అయిన 30 రోజుల తర్వాత టెలిస్కోప్ దాదాపు ఓపెన్ అవుతుంది. ఆపై జేడబ్ల్యూఎస్‌టీ L2కి చేరుకుంటుంది. ఇది చివరి కక్ష్యలో ఉండగా ల్యాండింగ్ దిద్దుబాట్లు, ప్లేస్‌మెంట్‌లు ప్రారంభమవుతాయి.

అలా అది దాని నిజమైన స్థానానికి చేరుకున్న తర్వాత..సైన్స్ ఇన్‌స్ట్రుమెంట్‌లను ఆన్ చేయడం..టెస్టింగ్ చేయడం వంటి అంత్యంత క్లిష్టమైన పని ప్రారంభమవుతుంది. ఈ పనుల్ని పూర్తి చేయడానికి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయమే పట్టవచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 13.5 బిలియన్ (1350 కోట్ల) కాంతి సంవత్సరాల క్రితమే ఏర్పడ్డ గెలాక్సీ నిర్మాణాన్ని అధ్యయనం చేయడంలో ఈ టెలిస్కోప్ చాలా ఉపయోగపడునుంది.

Read more : Central Government : 20 యూట్యూబ్ ఛానళ్లకు కేంద్రం షాక్

విశ్వం పుట్టుక సమయంలో ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? ఈ మధ్యలో ఎటువంటి మార్పులు జరిగాయి? మొదటి నక్షత్రాలు చీకటి నుంచి చీల్చుకుంటూ ఎలా ఉనికిలోకి వచ్చాయి? చిమ్మ చీకటిగా ఉండే విశ్వం కాంతితో ఎలా నిండింది? వంటి ఎన్నెన్నో విషయాల గుట్టు విప్పనుంది. విశ్వం గుట్టు విషయంలో శాస్త్రవేత్తలకు తెలియజేయడంలో ఈ టెలిస్కోప్ ఒక టైమ్ మెషిన్ గా పనిచేనుంది. అందుకే దీన్ని టైమ్ మిషన్ అంటున్నారు శాస్త్రవేత్తలు.

జేడబ్ల్యూఎస్‌టీ ఖగోళ దర్పణం కాలక్రమేణా మందమైన గెలాక్సీల పరిశీలిస్తుంది. దట్టమైన ధూళి, మేఘాల లోతుల్లోకి చూడగల ఈ టెలిస్కోప్ కొత్త నక్షత్రాలు, గ్రహ వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుంటుంది. ఈ టెలిస్కోప్ మన సౌర వ్యవస్థలోని వస్తువుల వివరణాత్మక వీక్షణను అందించడంతో పాటు సూర్యుల చుట్టూ తిరిగే నివాసయోగ్యమైన ఎక్సోప్లానెట్‌ల వాతావరణాన్ని కూడా అధ్యయనం చేయడంలో సహాయపడుతుందట. విశ్వం రహస్యాన్ని ఛేదించాలనే శాస్త్రవేత్తల ఇన్నేళ్ల ఎదురు చూపులకు ఈ టెలిస్కోప్ ఎటువంటి వింతల్ని..విశేషాల్ని అందించనుందో..!!