Central Government : 20 యూట్యూబ్ ఛానళ్లకు కేంద్రం షాక్

పనికట్టుకొని భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానెల్స్, 2 వెబ్ సైట్లకు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది.

Central Government : 20 యూట్యూబ్ ఛానళ్లకు కేంద్రం షాక్

Central Government

Central Government : పనికట్టుకొని భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానెల్స్, 2 వెబ్ సైట్లకు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తున్న 20 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్ సైట్లను ఐటీ చట్టం 2021 ప్రకారం బ్లాక్ చేసింది. ఇవి పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహాయంతో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

చదవండి : DD YouTube Channels : దూరదర్శన్ కు పాక్ లో పెరుగుతున్న ఆదరణ

భారత సంస్కృతీ, సంప్రదాయాలతోపాటు, దేశాన్ని దూషిస్తూ సౌర్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్లాక్ అయిన ఛానెల్ నయా పాకిస్థాన్ అనే పేరుతో ఇంతకాలం నడపబడింది. దీని కింద మరో 15 ఛానల్స్ నడుస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఆ ఛానల్‌కు 2 మిలియన్‌ల సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారని పేర్కొంది.

చదవండి : Richest Youtubers : డబ్బే డబ్బు.. యూట్యూబ్ ద్వారా కోట్ల సంపాదన.. ఇండియా రిచెస్ట్ యూట్యూబర్స్..

దేశానికి వ్యతిరేకంగా, దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా కంటెంట్ పెడితే సహించేది లేదని తేల్చిచెప్పింది సమాచార ప్రసార శాఖ. అయితే గత కొంతకాలంగా దేశంలోని పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలు, దేశానికి చెందిన ప్రముఖులపై ఈ ఛానల్స్ తప్పుడు ప్రచారం జరిగింది. ఈ విషయాన్నీ కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి వీటిని బ్లాక్ చేశారు.