Ukriane
Russia Ukraine War: గత ఎనిమిది రోజులుగా రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం..తీవ్ర రూపం దాల్చింది. యుక్రెయిన్ లోని ఒక్కో నగరాన్ని రష్యా సైన్యం చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. నగరాల్లోని ప్రభుత్వం భవనాలు, సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా సైన్యం.. సాధారణ జనావాసాలను సైతం నేలమట్టం చేస్తున్నాయి. రష్యా దాడులతో యుక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణ భయంతో కొందరు నగరాలను విడిచిపెట్టి పోతుండగా.. మరికొందరు శత్రు సైన్యంతో కలిసి పోరాడుతున్నారు. నానాటికీ ముందుకు వస్తున్న రష్యా సైన్యాన్ని ఎదురించేందుకు యుక్రెయిన్ పౌరులే సైన్యంగా మారి తుపాకులు చేతబడుతున్నారు. రష్యా దురాక్రమణ నుంచి తమ దేశాన్ని తామే కాపాడుకోవాలంటూ యుక్రెయిన్ దేశాధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు.. యుక్రెయిన్ ప్రజలు ఆయుధాలు పట్టారు.
Also read: Russia General Andrei : రష్యాకు బిగ్ షాక్..! యుక్రెయిన్ దాడుల్లో సైనిక జనరల్ హతం..!
రష్యా బలగాలను నిలువరించి తమ దేశం కోసం పోరాడుతున్నారు. ఇరు దేశాల సైనిక యుద్ధం కాస్త ప్రజా యుద్ధంగా అవతరించి.. చరిత్ర లికించబడింది. యుక్రెయిన్ లోని నగరాలను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా దేశంలోకి చొచ్చుకు వస్తున్న రష్యా సైన్యాన్ని.. వందలాది మంది యుక్రెయిన్ ప్రజలు అడ్డుకున్న తీరు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్శించింది. యుద్ధ ట్యాంకర్లతో దూసుకువస్తున్న రష్యా ఆర్మీని.. ఎక్కడిక్కడే దిగ్బంధిస్తున్నారు యుక్రెయిన్ ప్రజలు. యుక్రెయిన్ లోని ఎనర్‌గోడార్ నగరంలోకి ప్రవేశిస్తున్న రష్యా సైనికులను యుక్రెయిన్ పౌరులు అడ్డుకున్నారు. వందలాదిగా ప్రజలు రోడ్డుపై గుమిగూడి.. రష్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also read: Russia – Ukraine War: అసలే బాంబుల గోల.. మధ్యలో పెళ్లి మేళా
ఇసుక బస్తాలు, పాత టైర్లను రోడ్డుపై అడ్డుగా పెట్టి యుద్ధ ట్యాంకులను అడ్డుకున్నారు. తమ దేశంలోకి వస్తే సహించేది లేదంటూ యుక్రెయిన్ జాతీయ జెండాను చూపుతూ..రష్యా సైనికులను హెచ్చరించారు. రోడ్లతో పాటు గగనతలాన్ని వీడి వెళ్లిపోవాలంటూ యుక్రెయిన్ ప్రజలు నినాదాలు చేశారు. ఇక యుక్రెయిన్ ప్రజలు రోడ్డుపై రష్యా సైనికులను అడ్డుకున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు..”యుక్రెయిన్ పీపుల్స్ వార్ పై పుతిన్ గెలిచే అవకాశం లేదంటూ” కామెంట్స్ చేస్తున్నారు.
Also read: Flags on Russian Rockets: రాకెట్ పై ఇతర దేశాల జెండాలను తొలగించిన రష్యా: భారత్ జెండాకు మాత్రం గౌరవం