Russia General Andrei : రష్యాకు బిగ్ షాక్..! యుక్రెయిన్ దాడుల్లో సైనిక జనరల్ హతం..!

రష్యా బలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా సైనిక మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్ స్కీ(Russia General Andrei) యుక్రెయిన్ దాడుల్లో మరణించినట్టు..

Russia General Andrei : రష్యాకు బిగ్ షాక్..! యుక్రెయిన్ దాడుల్లో సైనిక జనరల్ హతం..!

Russia General Andrei Sukhovetsky

Russia General Andrei : యుక్రెయిన్ ప్రధాన నగరాలను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా గత వారం రోజులుగా తీవ్రంగా దాడులు చేస్తున్న రష్యా బలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా సైనిక మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్ స్కీ యుక్రెయిన్ దాడుల్లో మరణించినట్టు తూర్పు యూరప్ కు చెందిన అతిపెద్ద మీడియా సంస్థ నెక్ట్సా వెల్లడించింది. యుక్రెయిన్ పై రష్యా సేనలు దండయాత్ర ప్రారంభించాక… జనరల్ స్థాయి అధికారి(Russia General Andrei) మరణించడం ఇదే ప్రథమం.

ఇప్పటికే రష్యన్ సైనికులు యుక్రెయిన్ లో తాము ఎవరిపై పోరాడాలో తెలియక తీవ్ర వేదనకు గురవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, యుక్రెయిన్ బలగాలు మొక్కవోని పట్టుదలతో పోరాడుతూ తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ దాడుల్లో ఓ మేజర్ జనరల్ మరణించడం రష్యా సైన్యం ఆత్మస్థైర్యాన్ని బలహీనపరుస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Russia-Ukraine War : చైనా చూస్తోంది.. ఇక తైవాన్‌పైనే దండయాత్ర.. బాంబు పేల్చిన ట్రంప్!

రష్యా దురాక్రమణపై యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మరోసారి ఫైర్ అయ్యారు. యుక్రెయిన్ పౌరులకు కలిగిన ప్రతి నష్టానికి రష్యానే పరిహారం చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, మూడు సార్లు కరువులు, హోలోకాస్ట్ (యూదుల వధ), చెర్నోబిల్ విస్ఫోటనం, క్రిమియా దురాక్రమణ వంటి సంక్షోభాల నుంచి బయటపడి దేశాన్ని పునర్ నిర్మించుకున్నామని, ఇప్పుడు రష్యన్ల దాడులను కూడా తట్టుకుని నిలబడతామని, ఉక్రెయిన్ ను మళ్లీ నిర్మించుకుంటామని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు.

రష్యా తమను చాలాసార్లు నాశనం చేయాలని చూసిందని, కానీ తాము లొంగిపోతామని ఎవరైనా భావిస్తే వారికి యుక్రెయిన్ ప్రజల గురించి ఏమీ తెలియనట్టే అని అన్నారు. కాగా, ఇప్పటివరకు 9వేల మంది రష్యన్ సైనికులు మరణించారని జెలెన్ స్కీ తెలిపారు.

Flags on Russian Rockets: రాకెట్ పై ఇతర దేశాల జెండాలను తొలగించిన రష్యా: భారత్ జెండాకు మాత్రం గౌరవం

యుక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రపంచ దేశాలన్ని ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఈ యుద్ధాన్ని ఆపాలని చెబుతోంది. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ పై దురాక్రమణ జరుపుతున్న పుతిన్ పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంటి బయటే కాదు స్వదేశంలోనూ పుతిన్ నిరసన సెగలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రష్యా శ్రీమంతుడు అలెక్స్ కొనానిఖిన్ పుతిన్ తలపై రివార్డు ప్రకటించడం సంచలనంగా మారింది. దేశాన్ని నాజీయిజం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై కూడా ఉందన్న కొనానిఖిన్.. పుతిన్ తల నరికినా.. లేదా ప్రాణాలతో అరెస్ట్ చేసినా వారికి రూ.7.5 కోట్లు బహుమతిగా ఇస్తానని ఆఫర్ ఇచ్చారు.

రష్యన్ అయిన అలెక్స్.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అమెరికాలోనే ఉంటున్నారు. అమెరికాలో స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టిన క్రిప్టో ఇన్వెస్టర్‌గా బాగా ఫేమస్ అయ్యారు‌. ఆయన సంపద విలువ 300 మిలియన్‌ డాలర్లు. తను సంపాదించిన డబ్బులో ఒక మిలియిన డాలర్లు పుతిన్ ను హత్య చేయటానికి ఉపయోగిస్తానంటున్నారు. పుతిన్ పై ఉన్న తన ఆగ్రహాన్ని ప్రకటన ద్వారా వెళ్లగక్కారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ చేతులు కట్టుకుని ఉండలేనంటున్న ఈ వ్యాపారవేత్త పుతిన్ ను హత్య చేసినా.. అది సాధ్యం కాకపోతే అరెస్ట్ చేసినా ఒక మిలియన్ డాలర్లు ఇస్తాను అంటూ సంచలన ప్రకటన చేశారు.