Taliban : ఆఫ్ఘానిస్తాన్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్!
తమ పౌరులను తరలించేందుకు ఆఫ్ఘాన్ వచ్చిన విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు.ఉక్రెయిన్ పౌరులను కిందకు దింపి విమానం తీసుకెళ్లినట్లు ఆ దేశ విదేశాంగశాఖ సహాయమంత్రి తెలిపారు

Taliban
Taliban : ఆఫ్ఘానిస్తాన్ నుంచి తమ పౌరులను తీసుకెళ్లేందుకు వచ్చిన ఉక్రెయిన్ విమానం ఒకటి హైజాక్కు గురైంది. ఈ విమానాన్ని ఇరాన్ తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ విదేశాంగమంత్రి సహాయమంత్రి యెవ్‌జెనీ యెనిన్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ విమానాన్ని ఇరాన్ తరలించారని వివరించారు. ఈ విమానం ఆదివారం కొద్దీ మంది హైజాక్ చేశారు.
ఆదివారం ఈ విమానాన్ని దొంగిలించి ఇరాన్ తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. అందులో ఉన్న తమ పౌరులను కిందకు దించి, వేరేవారిని ఎక్కించి విమానం తరలించారని.. ఎవరిని తీసుకెళ్లారన్న విషయం తమకు తెలియదని తెలిపారు యెవ్‌జెనీ యెనిన్. ఈ చర్యతో తమ పౌరులను తరలింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడిందని వివరించారు. హైజాకర్ల వద్ద ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాము ఆఫ్ఘాన్ ప్రజలకు రక్షణ కల్పిస్తామని మాట ఇచ్చిన తాలిబన్లు.. ఇచ్చిన మాటను తప్పి అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇతర దేశాల పౌరులను కిడ్నాప్ చేస్తూ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నారు. మరోవైపు అమెరికాకు ఘాటుగా హెచ్చరికలు చేశారు. అమెరికా తమ బలగాలను ఆగస్టు 31 వరకు తరలించాలని తెలిపారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని లేఖ విడుదల చేశారు.
ఇక ఇదిలా ఉంటే అన్ని దేశాలు తమ పౌరుల తరలింపులో బిజీబిజీగా ఉన్నాయి. భారత్ ప్రతి రోజు రెండు విమానాలు నడుపుతుంది. అక్కడ చిక్కుకున్న వారిని క్షేమంగా దేశానికి తీసుకొస్తుంది. అంతేకాదు తాలిబన్లతో ప్రాణహాని ఉన్న ఆఫ్ఘాన్ పౌరులను కూడా భారత్ తరలిస్తున్నారు. గతంలో ఆఫ్ఘాన్ లో వివిధ శాఖల్లో పనిచేసిన సుమారు 100 మంది అధికారులు భారత్ కు వచ్చారు. వారికి భారత ప్రభుత్వమా ఆశ్రయం కల్పిస్తుంది.