ZELENSKY-WIFE Photoshoot : మ్యాగజైన్ కవర్ పేజీ కోసం భార్యతో జెలెన్‌స్కీ ఫొటోషూట్..విమర్శలపై ఒలెనా సమాధానం..

రష్యా చేస్తున్న యుద్ధాన్ని అతి సమర్థవంతంగా ఎదుర్కొంటూ ‘రియల్ హీరో’ అనిపించుకుంటున్న యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఒక్కసారిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశం యుద్ధంతో అతలాకుతలం అవుతుంటే భార్యతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొన్నారు జెలెన్ స్కీ. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఒలెనా మాత్రం ఆమెదైన శైలిలో ఇచ్చిన వివరణ ఇచ్చారు.

Volodymyr Zelensky..Wife Olena Appears On Vogue Cover : దాదాపు 6 నెలల నుంచి రష్యా చేస్తున్న యుద్ధాన్ని అతి సమర్థవంతంగా ఎదుర్కొంటూ ‘రియల్ హీరో’ అనిపించుకుంటున్న యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఒక్కసారిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈనాటికీ దేశం మొత్తం యుద్ధంతో అతలాకుతలం అవుతుంటే భార్యతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొన్నారు జెలెన్ స్కీ. ప్రముఖ మ్యాగజైన్ ‘వోగ్’ కోసం జెలన్‌స్కా భార్య ఒలెనా జెలెన్‌స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు.అంతేకాదు మ్యాగజైన కోసం ఫోటో షూట్ చేశారు.రకరకాల యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు జెలెన్ స్కీ దంపతులు. యుద్ధంతో దేశం అల్లాడిపోతుంటే ఈ ఫోటోషూట్ లు అవసరమా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also read : Olena Zelenska : నాకు భయం, కన్నీళ్లు రావు.. నా భార్త జెలెన్ స్కీతో ఇక్కడే ఉన్నాం.. ఎక్కడికి పోలేదు..!

ఈ విమర్శలపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు భర్తతో కలిసి ఆమె ఫొటోషూట్‌లో పాల్గొన్న జెలెన్ స్కీ భార్య ఒలెనా. కవర్ పేజీపై ఫొటో రావడం సాధారణ విషయం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ ఫొటోలు వోగ్ కవర్ పేజీపై రావాలని కలలు కంటారని ఒలెనా రాసుకొచ్చారు. వారి కల నెరవేరాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు ఒలెనా.

అధ్యక్ష భవనంలోనే జరిగిన ఈ ఫొటోషూట్‌లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పలు పోజులిచ్చారు. యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను ప్రపంచం ముందు ఉంచాలనే ఉద్దేశంతో యుద్ధ ట్యాంకులు, సైనికులతో కలిసి ఒలెనా పోజులిచ్చారు. అనంతరం ఈ ఫొటోలను ఒలెనా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటో రావడం సాధారణ విషయం కాదని..ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ ఫొటోలు వోగ్ కవర్ పేజీపై రావాలని కలలు కంటారని ఒలెనా వివరించారు. వారి కల నెరవేరాలని కోరుకుంటున్నానని పోస్టులో పేర్కొన్నారు. అయితే..దానికి యుద్ధం కారణం కాకూడదని అనుకుంటున్నానన్న ఒలెనా ఉక్రెయిన్‌లోని ప్రతి మహిళా తన స్థానంలో కవర్ పేజీపై ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

యుద్ధం కారణంగా శరణార్థి శిబిరాల్లో దయనీయంగా బతుకుతున్న ప్రతి మహిళకు ఈ కవర్ పేజీపై ఉండే హక్కు ఉందన్నారు. కాగా..ఈ ఫొటోషూట్ తర్వాత జెలెన్‌స్కీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్న వేళ జెలెన్‌స్కీ ఇలా ఫొటోషూట్‌లో పాల్గొన్నారంటే నమ్మలేకపోతున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు మాత్రం వాస్తవాన్ని తెలియజేసేందు ఈ ఫోటో షూట్ ఉపయోగపడుతుంది అంటూ తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

కాగా ..యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ కూడా తన ఫ్యామిలీతో కలిసి దేశం విడిచిపారిపోయారంటూ వదంతులు వినిపించిన సమయంలో ఈ వదంతులపై అధ్యక్షుడు జెలెన్ స్కీ సతీమణి, యుక్రెయిన్ ప్రథమ మహిళ అయిన ఒలెనా జెలెన్ స్కీ  సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నా భర్త ఎక్కడికి పోలేదు.. ఇక్కడే యుక్రెయిన్ లోనే ఉన్నాడు.. ఆయన వెంట నేనూ కూడా ఉన్నాను.. అంటూ వెల్లడించారు. అలా తన భర్తకు ధైర్యం చెబుతూ అక్కడే ఉండేలా ఆయన్ను ప్రేరేపించింది ఒలెనా జెలెన్‌స్కా. ఆ దేశ ప్రధమ మహిళగా ప్రజల వెంట నేనుంటాను అంటూ దేశ పౌరులకు ఆమె ధైర్యం చెబుతున్న వీడియో అప్పట్లో వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు