Olena Zelenska : నాకు భయం, కన్నీళ్లు రావు.. నా భార్త జెలెన్ స్కీతో ఇక్కడే ఉన్నాం.. ఎక్కడికి పోలేదు..!

Olena Zelenska : యక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి దూసుకొస్తున్నా యుక్రెయిన్ సైన్యం మాత్రం దీటుగానే ప్రతిఘటిస్తోంది.

Olena Zelenska : నాకు భయం, కన్నీళ్లు రావు.. నా భార్త జెలెన్ స్కీతో ఇక్కడే ఉన్నాం.. ఎక్కడికి పోలేదు..!

Ukrainian President Zelenskyy’s Wife, Olena, Speaks Out Amid Russian Invasion ‘i Will Not Have Panic And Tears’

Olena Zelenska : యక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి దూసుకొస్తున్నా యుక్రెయిన్ సైన్యం మాత్రం దీటుగానే ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి దేశ పౌరులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ కూడా తన ఫ్యామిలీతో కలిసి దేశం విడిచిపారిపోయారంటూ వదంతులు వినిపిస్తున్నాయి.

ఈ వదంతులపై అధ్యక్షుడు జెలెన్ స్కీ సతీమణి, యుక్రెయిన్ ప్రథమ మహిళ అయిన ఒలెనా జెలెన్ స్కీ (43) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అధ్యక్షుడు జెలెన్ స్కీ దేశం విడిచిపోయారంటూ ఎన్ని వదంతలు వ్యాప్తి చేసినా… లేదు.. నా భర్త ఎక్కడికి పోలేదు.. ఇక్కడే యుక్రెయిన్ లోనే ఉన్నాడు.. ఆయన వెంట నేనూ కూడా ఉన్నాను.. అంటూ ఆమె వెల్లడించారు.

ఇప్పటికే నా శత్రువుకు నేనే మొదటి గురి.. ఆ తర్వాత నా కుటుంబమని జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తన కుటుంబాన్ని స్వదేశంలోనే ఉంచారు. ప్రాణాలను కాపాడుకునేందుకు మా దేశం రమ్మని ప్రపంచ దేశాలు ఆఫర్‌ ఇచ్చిన ఆయన సున్నితంగా తిరస్కరించారు. శత్రువులు దూసుకొస్తున్నారు.

ఏ క్షణమైన తమపై దాడి చేసే అ వకాశం ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లోనూ తన భర్తకు ధైర్యం చెబుతూ అక్కడే ఉండేలా ఆయన్ను ప్రేరేపించింది మాత్రం సతీమణి ఒలెనా జెలెన్‌స్కా. ఆ దేశ ప్రధమ మహిళగా ప్రజల వెంట నేనుంటాను అంటూ దేశ పౌరులకు ఆమె ధైర్యం చెబుతోంది.

Ukrainian President Zelenskyy’s Wife, Olena, Speaks Out Amid Russian Invasion ‘i Will Not Have Panic And Tears’ (1)

Ukrainian President Zelenskyy’s Wife, Olena, Speaks Out Amid Russian Invasion ‘i Will Not Have Panic And Tears’

Olena Zelenska : ఎన్ని సమస్యలొచ్చినా ఇక్కడే ఉంటాం.. :
భర్త నటుడిగా ఉన్నప్పుడే అతడు రాజకీయాల్లోకి వెళ్తానంటే ఆమె వద్దని చెప్పింది. అయినప్పటికీ రాజకీయాల్లో వచ్చిన జెలెన్ స్కీకి ప్రతి అడుగులో ఆయన వెంటే నడిచారు సతీమణి ఒలెనా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ బలగాలకు భయపడి దేశం విడిచి వెళ్లేది లేదంటున్నారు. తన పిల్లలతో సహా ఇక్కడే ఉండిపోయానని ఆమె చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. ‘నాకు భయం లేదు. కన్నీరు అసలే రాదు. నేను ప్రశాంతంగానే ఉన్నాను.. ధైర్యంగా ఉంటాను. నా పిల్లలు నా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారి పక్కన నేను ఉండాలి. అలాగే నా భర్త పక్కన ఉండి ఆయనకు ధైర్యాన్ని ఇవ్వాలి.. దేశ ప్రజలకు అండగా నిలబడాలి’ అంటూ వ్యాఖ్యానించారు ఆమె.

‘నేను నా కుటుంబమంతా ఈ దేశంలోనే జీవిస్తాం.. ఎన్ని సమస్యలు ఎదురైన సరే.. అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు పోరాడుతున్నామని తెలిపింది. రష్యా దాడుల నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒలెనా ఇలా పోస్టు పెట్టారు.. తన పిల్లలను సురక్షితమైన ప్రదేశానికి తరలించినట్టు ఆమె వెల్లడించారు. అయితే వారి భద్రత దృష్ట్యా ఎక్కడ ఉన్నారనేది ఆ స్థానాన్ని వెల్లడించలేదు.

Ukrainian President Zelenskyy’s Wife, Olena, Speaks Out Amid Russian Invasion ‘i Will Not Have Panic And Tears’ (2)

Ukrainian President Zelenskyy’s Wife, Olena, Speaks Out Amid Russian Invasion ‘i Will Not Have Panic And Tears’

Olena Zelenska : జెలెన్ స్కీకి తోడుగా తెరవెనుకే ఉండి.. 
జెలెన్‌స్కీకి ప్రతి విషయంలోనూ సలహాలను ఇస్తూ ఆయనకు తోడుగా తెరవెనుక ఉండి నడిపిస్తున్నారు ఒలెనా జెలెన్ స్కీ.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆమె తన మాటలతో ప్రపంచం దృష్టిలో పడ్డారు. ఒలెనా తన భర్త జెలెన్ స్కీని Kryvyi Rih నేషనల్ యూనివర్శిటీలో కలుసుకున్నారు. అక్కడే ఆమె ఆర్కిటెక్చర్ రైటింగ్ పూర్తి చేసింది.

జెలెన్ స్కీ దంపతులకు ఒలెక్సాండ్రా (17), కైరి (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జెలెన్ స్కీ, ఒలెనా ఇద్దరూ 2003లో వివాహం చేసుకున్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలోనూ, పబ్లిక్ స్పాట్‌లైట్‌లోనూ ఇద్దరూ కలిసే పని చేయడం కొనసాగించారు.

2019లో జెలెన్ స్కీ అధ్యక్షుడయ్యే ముందు ప్రముఖ హాస్యనటుడిగా అందరికి సుపరిచితమే.. తన భర్త స్థాపించిన నిర్మాణ సంస్థ క్వార్టల్ 95 స్టూడియో కోసం స్క్రీన్ రైటర్‌గా కూడా సతీమణి ఒలెనా కొనసాగుతున్నారు.

ఇతర దేశాలకు తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిన సమయంలో ఒలేనా పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ప్రిన్స్ విలియం కేట్ మిడిల్టన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మేడమ్ బ్రిగిట్టే మాక్రాన్‌లతో కలిసి రాష్ట్ర పర్యటనలకు హాజరయ్యారు.

Read Also: Russia warns France: ‘హద్దు దాటితే మీకూ మూడిందే’ ఫ్రాన్సును హెచ్చరించిన రష్యా మాజీ అధ్యక్షుడు