Russian Troops Killed : రష్యాకు బిగ్‌లాస్ .. 15,300 మంది సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ వెల్లడి

ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. ఇప్పటివరకు 15వేల 300 మందికి పైగా రష్యా సైనికులను(Russian Troops Killed) మట్టుబెట్టినట్టు..

Russian Troops Killed : గత 27 రోజులుగా యుక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా దాడుల్లో తీవ్రత పెంచింది రష్యా. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలను రష్యా సేనలు ఉపయోగిస్తున్నాయి. అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు పుతిన్.

యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. దాదాపు 4 వారాలుగా భీకర గెరిల్లా యద్ధం కొనసాగుతోంది. పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. అంతేకాదు, ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో రష్యా తన సైనికులను కోల్పోతోంది.(Russian Troops Killed)

Biological Weapons On Ukriane : యుక్రెయిన్‌పై రష్యా రసాయన, జీవాయుధాలు ప్రయోగించొచ్చు-బైడెన్ సంచలన వ్యాఖ్యలు

రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటించి శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు యుక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు 15వేల 300 మందికి పైగా రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు తెలిపింది. అలాగే 99 యుద్ధ విమానాలు, 123 హెలికాప్టర్లతో పాటు 509 యుద్ధ ట్యాంకులు, 1556 సాయుధ శకటాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు యుక్రెయిన్‌ విదేశాంగశాఖ వెల్లడించింది.(Russian Troops Killed)

పది నిమిషాలకో బాంబుదాడి..!
మరోవైపు రష్యా సేనలు దాడుల్లో తీవ్రతను పెంచాయి. యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై బాంబులు, క్షిపణులతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మరియుపోల్‌, కీవ్‌, ఖార్కివ్‌ నగరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. మరియుపోల్‌ స్వాధీనానికి రష్యా సేనలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ నగరాన్ని నలుదిశలా చుట్టుముట్టాయి. మరియుపోల్‌లో ప్రతి పది నిమిషాలకు బాంబు దాడులు చేస్తున్నాయి.(Russian Troops Killed)

Chernobyl Danger : చెర్నోబిల్ డేంజర్ బెల్స్.. యుక్రెయిన్‌తో పాటు సరిహద్దు దేశాలకు పొంచి ఉన్న ముప్పు

మరియుపోల్‌పై భీకర దాడులు అందుకే..
క్రిమియా నుంచి డాన్‌బాస్‌ ప్రాంతం మీదుగా పశ్చిమ రష్యాను కలిపే భూమార్గంలో మరియుపోల్‌ పోర్టు సిటీ కీలక మార్గంలో ఉంది. దీనిని ఆధీనంలోకి తీసుకోకుండా వ్యూహాత్మక లక్ష్యాలను సాధించే అవకాశం రష్యాకు లభించదు. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే రణరంగంలో రష్యా అతిపెద్ద విజయం సాధించినట్లవుతుంది. కాగా, రష్యా దాడుల తీవ్రతకు మరియుపోల్‌ నగరం పలు చోట్ల శిథిలాలతో నిండిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

Russia Condom Sales : యుద్ధం వేళ.. రష్యాలో భారీగా పెరిగిన కండోమ్ అమ్మకాలు

కీవ్‌ వైపు వెళ్లే రోడ్లన్నీ ల్యాండ్‌మైన్లే..
గత నాలుగు వారాలుగా రష్యా కొనసాగిస్తున్న భీకర దాడులతో యుక్రెయిన్‌ దద్దరిల్లుతోంది. రష్యా దండయాత్రతో యుక్రెయిన్‌లోని పలు నగరాల్లో భయానక వాతావరణం నెలకొంది. చెర్న్‌హీవ్‌లో పరిస్థితిని యుక్రెయిన్‌ ఎంపీ లేసియా వాసిలెంకో సోషల్ మీడియాలో వివరించారు. అందుబాటులో నీరు లేదని.. అక్కడ మంచు వేగంగా కరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. లక్షలాది మంది జనం నగరంలోనే చిక్కుకుపోయారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కీవ్‌ వైపు వెళ్లే రోడ్లన్నీ ల్యాండ్‌మైన్‌లతో నిండిపోయాయనీ.. వీధుల్లో భీకర పోరు నాన్‌స్టాప్‌గా కొనసాగుతోందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు