North Korea : అమెరికా వల్లనే యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. అగ్రరాజ్యంపై ఉత్తరకొరియా ఆగ్రహం!

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత ఉత్తర కొరియా మొదటిసారిగా ఘాటుగా స్పందించింది. నియంత పాలన సాగే ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.

Ukrainian Crisis North Korea Blames Us For Russian Invasion Of Ukraine

North Korea :  యుక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్టుగా యుక్రెయిన్, రష్యా బలగాలు దీటుగా పోరాడుతున్నాయి. యుక్రెయిన్ శాంతిచర్చల కోసం ప్రయత్నించగా.. రష్యా మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా తమ బలగాలతో యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి చొచ్చుకుని వస్తున్నాయి. యుక్రెయిన్ మిలటరీతో పాటు అక్కడి పౌరులను కూడా విచక్షణ లేకుండా దాడికి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సైతం ముందుకు వచ్చి రష్యాను వారించేందుకు ప్రయత్నించినా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఈ క్రమంలో పశ్చిమ దేశాలు కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించాయి. రష్యా యుక్రెయిన్‌పై దండయాత్ర చేయడంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. పశ్చిమ దేశాలు సైతం రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రపంచ దేశాల ఆంక్షలు, హెచ్చరికలను సైతం పుతిన్ లెక్కచేయకుండా తమ బలగాలను మరింత లోపలికి దూసుకుపోయేలా ఆదేశాలిచ్చారు. యుక్రెయిన్ కూడా దీటుగా రష్యా బలగాలను ఎదుర్కొంటోంది. యుక్రెయిన్‌లో సంక్షోభానికి కారణమైన రష్యా దండయాత్రకు మూల కారణం యునైటెడ్ స్టేట్స్ అని ఉత్తర కొరియా ఆరోపించింది. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత ఉత్తర కొరియా మొదటిసారిగా ఘాటుగా స్పందించింది. నియంత పాలన సాగే ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. యుక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణమంటూ ఉత్తర కొరియా నిందిస్తోంది. ఈ మేరకు ఉత్తర కొరియా విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో పోస్టు పెట్టింది.

అమెరికా మిలటరీ ఆధిపత్యం కోసమే : 
రష్యా దేశ భద్రత పట్ల డిమాండ్లను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఉత్తర కొరియా.. అమెరికా మిలటరీ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపణలు గుప్పించింది. ఉత్తర కొరియా నార్త్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీలో పరిశోధకుడైన రి జి సింగ్‌ (Ri Ji Song) ఈ పోస్టును పెట్టారు. ‘వాషింగ్టన్.. తన భద్రత కోసం రష్యా చట్టబద్ధమైన డిమాండ్‌ను పట్టించుకోకుండా సైనిక ఆధిపత్యాన్ని అనుసరించింది. యుక్రేనియన్ సంక్షోభానికి మూల కారణం కూడా అమెరికానే.. తన మిలటరీ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఇలా ఏకపక్షంగా వ్యవహరించింది’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఉత్తరాది విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఈ పోస్టు అప్‌లోడ్ అయింది.

Ukrainian Crisis North Korea Blames Us For Russian Invasion Of Ukraine

శాంతి స్థిరత్వం పేరుతో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందని ఆరోపించింది. ద్వంద్వ ప్రమాణాన్ని కలిగి ఉందని Ri Ji Song అమెరికా నిందించారు. అమెరికా సర్వోన్నతంగా పరిపాలించే రోజులు పోయాయని Ri Ji Song మండిపడ్డారు. అలాగే, ఇతర దేశాలు ఆత్మరక్షణ కోసం మాట్లాడితే అగ్రరాజ్యం సహించలేకపోతోందని Ri Ji Song ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకి అధికార దాహం ఎక్కువైందని, ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

తన ఆధిపత్యాన్ని కోల్పోతే అగ్రరాజ్యం అసలు సహించలేదని రి జి సంగ్ ఆరోపించారు. ఒక అధ్యయనకారుడి వ్యక్తిగత అభిప్రాయాన్ని విదేశాంగ శాఖ తమ వెబ్‌సైట్లో ఎందుకు అప్ లోడ్ చేసిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. బీజింగ్‌తో పాటు, రష్యా ఉత్తరాదికి అంతర్జాతీయ మిత్రుల్లో అమెరికా ఒకటిగా ఉంది. అణ్వాయుధ ఉత్తర కొరియాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కిమ్‌కు అత్యంత మిత్రదేశమైన చైనా కూడా ఇటీవలి వారాల్లో యుక్రెయిన్‌ సంక్షోభాన్ని సమర్థించడంతో పాటు అమెరికా సహా ఇతర పాశ్చాత్య మిత్రదేశాలపై విమర్శలు గుప్పించింది.

Read Also : Russia Ukraine Crisis : రష్యాలో బ్యాంకుల దిగ్బంధనం.. ఏటీఎంలకు రష్యా వాసుల పరుగులు.. వీడియో!