Russia Ukraine Crisis : రష్యాలో బ్యాంకుల దిగ్బంధనం.. ఏటీఎంలకు రష్యా వాసుల పరుగులు.. వీడియో!

యుక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు ప్రపంచ దేశాలు గట్టి షాకిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. యుక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా దురాక్రమణకు బ్రేక్ వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

Russia Ukraine Crisis : రష్యాలో బ్యాంకుల దిగ్బంధనం.. ఏటీఎంలకు రష్యా వాసుల పరుగులు.. వీడియో!

Russia Ukraine Crisis Video Appears To Capture Russian Panic Over Impending Bank Blockade

Updated On : February 28, 2022 / 8:21 AM IST

Russia Ukraine Crisis : యుక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు ప్రపంచ దేశాలు గట్టి షాకిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఎంత చెప్పినా మాటవినకుండా యుక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా దురాక్రమణకు బ్రేక్ వేసేందుకు కీలక చర్యలను చేపడుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాతో గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్స్ (SWIFT) ఒప్పందాన్ని మరింత కఠినతరం చేయనున్నాయి. అమెరికా, బ్రిటన్, ఐరోఫా సమాఖ్య కెనడా వంటి పశ్చిమ దేశాలు.. రష్యాలోని SWIFT (Society for Worldwide Interbank Financial Telecommunication) బ్యాంకుల దిగ్బంధనం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తొలగిస్తున్నట్టు ఇప్పటికే పశ్చిమ దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రష్యన్ వాసుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. యుక్రెయిన్‌పై దాడిచేసిన రష్యాపై పాశ్చాత్య దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగానే గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ SWIFT నుంచి రష్యాను మినహాయించే ఒప్పందంలో ఆర్థిక ఆంక్షలు విధించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకుల అంతర్గత గ్లోబల్ పేమెంట్స్ నిలిచిపోతాయనే ఆందోళనల నేపథ్యంలో ముందుగానే రష్యా వాసులంతా ఏటీఎంల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ఆయా బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు విత్ డ్రా చేసుకుని ఇంట్లో దాచిపెట్టుకునేందుకు ఏటీఎంలకు క్యూ కట్టేస్తున్నారు.

వందల కొలది రష్యా వాసులు ఏటీఎంల దగ్గర బారులు తీరి ఉన్నారు. రష్యాకు వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా అంతటా అంతర్గత భయాందోళనలు మొదలయ్యాయి. రష్యా మిలిటరీ యుక్రెయిన్ నగరాలపై దాడి చేయడంతో పాశ్చాత్య మిత్రదేశాలు ఆ దేశ బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించాయి. రష్యాలో డబ్బు బదిలీకి వినియోగించే అంతర్జాతీయ వ్యవస్థ స్విప్ట్‌ (SWIFT) నుంచి ఎంపిక చేసిన బ్యాంకులను తొలగించనున్నాయి. తద్వారా రష్యా అంతర్జాతీయ వాణిజ్య సామర్థ్యాన్ని తీవ్రంగా అడ్డుకునే దిశగా చర్యలు చేపడుతున్నాయి.

రష్యాలో సుమారు 200 దేశాలలో దాదాపు 11వేల కంటే ఎక్కువ ఆర్థిక సంస్థలు SWIFT ద్వారా అంతర్జాతీయ లావాదేవీలను జరుపుతున్నాయి. 300 రష్యన్ ఆర్థిక సంస్థలు ఈ ఆర్థిక వ్యవస్థకు చెందినవే ఉన్నాయి. ఈ బ్యాంకులను తొలగిస్తే.. రష్యా అంతర్జాతీయ లావాదేవీల నిర్వహణ ఇబ్బందికరంగా మారనుంది. అందుకే రష్యా వాసులంతా ఏటీఎంల దగ్గరకు క్యూ కట్టేస్తున్నారు. రష్యా వాసులు ఏటీఎంల దగ్గర బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు. యుక్రేనియన్ నగరాలపై రష్యా దళాలు జరిగిన క్షిపణులతో దాడుల్లో ముగ్గురు పిల్లలతో సహా 198 మంది పౌరులు మరణించారని, ఇప్పటివరకు 1,115 మంది గాయపడ్డారని ఉక్రేనియన్ ఆరోగ్య మంత్రి విక్టర్ లియాష్కో వెల్లడించారు.

Read Also : Ukraine Strategy : రష్యా బలగాలను దారిమళ్లించేందుకు యుక్రెయిన్ వ్యూహం.. రోడ్లపై సైన్ బోర్డులను మార్చేస్తున్నారు!