ULTRASOUND: ఆల్ట్రాసౌండ్ వైబ్రేషన్స్‌కు కరోనా వైరస్ చిత్తు!

ఆల్ట్రాసౌండ్ వైబ్రేషన్స్‌కు పలు రకాల కరోనా వైరస్‌లు నాశనమయ్యే అవకాశముందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చర్లు పేర్కొన్నారు. 25నుంచి 100 మెగా హెడ్జ్‌ల ధ్వని ప్రకంపనాలకు వైరస్ కొమ్ములు వాలిపోయి, చిటికెలోనే విరిగిపోతాయని గుర్తించారు.

ULTRASOUND: ఆల్ట్రాసౌండ్ వైబ్రేషన్స్‌కు కరోనా వైరస్ చిత్తు!

Ultrasound has potential to damage novel coronaviruses

Updated On : March 19, 2021 / 7:23 AM IST

ULTRASOUND: ఆల్ట్రాసౌండ్ వైబ్రేషన్స్‌కు పలు రకాల కరోనా వైరస్‌లు నాశనమయ్యే అవకాశముందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చర్లు పేర్కొన్నారు. 25నుంచి 100 మెగా హెడ్జ్‌ల ధ్వని ప్రకంపనాలకు వైరస్ కొమ్ములు వాలిపోయి, చిటికెలోనే విరిగిపోతాయని గుర్తించారు. గాలి, నీరు ఉండే కరోనా వైరస్‌లపై ఆల్ట్రాసౌండ్ వైబ్రేషన్స్ తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.

వైరస్ కారణంగా తలెత్తే ఇన్ఫెక్షన్లు ఈ విధానంలో చికిత్సలను రూపొందించే వీలుందని ప్రొఫెసర్ థామస్ విర్జ్‌బికి పేర్కొన్నారు. రీసెర్చ్‌లో భాగంగా.. కరోనా వైరస్ భౌతిక గుణాలను నిపుణులు పరిగణనలోకి తీసుకుని, 100 మెగా హెడ్జ్‌ల ధ్వని ప్రకంపనాలను సృష్టించారు. వైరస్ పెంకుపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కంప్యూటర్ మోడల్ ద్వారా అంచనా వేశారు.

ఆల్ట్రాసౌండ్ ప్రకంనాల వల్ల కరోనా వైరస్ చుట్టూ ఉండే పెంకు బద్ధలవుతుంది. దానిపై ఉండే కొమ్ములు ధ్వంసమై విడిపోతాయి. ఇవి స్పష్టంగా బయటకు కనిపించే ప్రభావాలు అయితే అంతర్లీనంగా వైరస్ ఆర్ఎన్ఏ కూడా దెబ్బతింటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి శబ్ద ప్రకంపనాల కారణంగా వైరస్ పై పడే ప్రభావాన్ని మాత్రమే గుర్తించాం. అయితే అది ఎలా జరుగుతుందనేది తెలుసుకోవడానికి మరింత లోతైన రీసెర్చ్ అవసరం’ అని రీసెర్చర్స్ చెబుతున్నారు.

మెకానిక్స్ అండ్ ఫిజిక్స్ ఆఫ్ సోలిడ్స్ అనే జర్నల్ లో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి.