Solar Storm : భూమికి పొంచి ఉన్న ముప్పు.. ఇంటర్నెట్ బంద్..?
భూమికి సౌర తుఫాన్ ముప్పు పొంచి ఉందా? కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయమా? ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోనుందా? శాటిలైట్లు, పవర్ గ్రిడ్స్, ఆయిల్ గ్యాస్ పైప్ లైన్లు, నెట్ వర్కింగ్ కే

Solar Storm
Solar Storm : భూమికి సౌర తుఫాన్ ముప్పు పొంచి ఉందా? కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయమా? ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోనుందా? శాటిలైట్లు, పవర్ గ్రిడ్స్, ఆయిల్ గ్యాస్ పైప్ లైన్లు, నెట్ వర్కింగ్ కేబుల్స్ డ్యామేజ్ అవుతాయా? ఇప్పుడు అందరిలోనూ ఇవే భయాలు నెలకొని ఉన్నాయి. సౌర తుఫాన్ గురించి కొంతకాలంగా శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వలన ఇంటర్నెట్ పూర్తిగా షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. చివరిసారిగా ఈ ప్రమాదం 1989లో జరిగింది. మరోసారి ఈ ప్రమాదం జరగబోతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
సూర్యుడి ఉపరితలంపై జరిగే విస్పోటనంతో సూర్య కాంతి వెలువడుతుంది. విస్పోటనం ద్వారా పెద్ద మొత్తంలో అయస్కాంత శక్తిని విడుదల చేస్తుంది. దీని వలన సూర్యుడి బాహ్య ఉపరితలం కొంత భాగం తెరుచుకుంటుంది. ఇది అగ్ని గోళంగా కనిపిస్తుంది. ఇందులో నుంచి అణు కణాలు విడుదలవుతాయి. ఈ కణాలు విశ్వంలో పూర్తి శక్తితో వ్యాప్తి చెందుతాయి. దీనిని సౌర తుపాను అంటారు.
Best Drinks : శరీరంలో కొవ్వును తగ్గించే పది పానీయాలు..
అనేక రకాల సౌర తుఫాన్లు సంభవించడమనేది.. వాటి నుంచి విడుదలయ్యే శక్తిపై ఆధారపడి ఉంటాయి. ఇవి అత్యంత సాధారణ సూర్య కాంతి. సూర్యుడి బాహ్య వలయం ద్వారా సోలార్ శక్తి ఉత్పన్నమవుతుంది. ఇక ఈ సూర్య కాంతి తర్వాత కరోనల్ మాస్ ఎజెక్షన్ ఈవెంట్ లేదా ఒక సీఎంఈ ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడి ఉపరితలం నుంచి బయటకు వచ్చే అయనీకరణ కణాలలో భారీగా విస్పోటనం జరుగుతుంది. ఈ సమయంలో దాని మార్గంలో ఉన్న వాటిని ఇది పూర్తిగా కవర్ చేస్తుంది.
సీఎంఈ కారణంగా అయనీకరణం చెందిన కణాలు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాన్ని నాశనం చేయగలవు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయే అవకాశం ఉంది. సౌర తుఫాను ఇలాంటి పెద్ద నష్టాలను కలిగించడమనేది చాలా అరుదు. ఇలాంటి అతి పెద్ద తుఫాన్ చివరి సారిగా 1989లో సంభవించింది. ఇక ఈ ఏడాదిలో కూడా భారీ తుఫాన్ వచ్చే అవకాశం ఉందని.. దీని వలన ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా వినాశనం కాబోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సముద్ర అంతర్భాగం కేబుల్ వ్యవస్థపై ప్రభావం..
సౌర తుఫాన్ల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థపై ముఖ్యంగా సముద్ర అంతర్భాగం గుండా విస్తరించి ఉన్న కేబుల్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుందని, జీపీఎస్ వ్యవస్థ కుప్పకూలుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అప్పుడు మొత్తం వ్యవస్థ ఆగిపోయే అవకాశాలున్నాయి. సౌర తుఫాన్లు అనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1989లో ఓ మోస్తరు తుఫాన్ కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు. అందుకే తీవ్ర నష్టం ఉండొచ్చని భయపడుతున్నారు.
Rs 800 KG Bhindi : ఈ బెండకాయలు కిలో రూ.800.. ఎందుకంత కాస్ట్లీ అంటే
సిగ్‌కామ్ 2021(SIGCOMM 2021) పేరుతో జరిగిన డేటా కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సౌర తుపానుల మీద కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్విన్‌కు చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి సమర్పించిన ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సౌర తుపాన్ గనుక భూమిని తాకితే.. ఆ ప్రభావంతో గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోనుందని ఆమె అంటున్నారు. అయితే ఈ వాదనతో పలువురు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు సైతం అంగీకరించడం ఆందోళనకు గురి చేస్తోంది
సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్దఎత్తున దెబ్బతినే ప్రమాదం ఉంది. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు ఉంటుంది? ఎన్నిరోజుల్లో తిరిగి యధాస్థితికి తీసుకురావచ్చనే విషయాలపై మాత్రం ఇప్పుడే అంచనాకి రాలేమని అంటున్నారు. అంత పెద్ద విపత్తు ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం సిద్దంగా లేదు. నష్టం కూడా బాగానే ఉండవచ్చు అంటున్నారు అబూ జ్యోతి.
ఆసియా దేశాలకు తక్కువ నష్టం..
ఒక వేళ సౌర తుపాను విరుచుకుపడితే ఆసియా దేశాలకు తక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆమె అంటున్నారు. ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండటం కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుందని ఆమె అంటున్నారు.