UNICEF Photo Awards :యూనిసెఫ్ ఫొటో ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డుల్లో భారత్ సత్తా.. వాటి స్పెషాలిటీ ఇదే!

యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డులు విడుదుల చేసింది. వీటిల్లో ఫస్ట్, సెకండ్ భారత్ కే రావటం విశేషం. మరి ఆ ఫోటోల ప్ర‌త్యేకత ఏంటీ..ఆ ఫోటోలు ఎవరి తీసారో తెలుసా.

UNICEF Photo of the Year : యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డులు భారత్ ను వరించాయి. యూనిసెఫ్ సంస్థ జ‌ర్మ‌నీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయ‌ర్ పోటీల్లో భార‌త్‌కు రెండు అవార్డులు ద‌క్కాయి. ఫ‌స్ట్‌, సెకండ్ అవార్డులు భార‌త్‌కే ద‌క్క‌డం సంతోషించాల్సిన విషయం. యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయ‌ర్ కోసం అంత‌ర్జాతీయ పోటీల‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం నిర్వ‌హిస్తుందనే విషయం తెలిసిందే.ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిన్నపిల్లలుఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు..వారిని చైత‌న్య ప‌రిచే ప‌రిస్థితులు వంటి అంశాలపై తీసిన ఫోటోలకు అవార్డులు ప్రకటిస్తంది యూనిసెఫ్. అలా వచ్చిన ఎంట్రీల‌లో యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయ‌ర్‌తో పాటు సెకండ్, థ‌ర్డ్‌, కాంప్లిమెంట్ అవార్డుల‌ను యూనిసెఫ్ జ్యూరీ ప్ర‌క‌టించింది. వీటిలో మొద‌టి..రెండు అవార్డులు భార‌త్‌కు ద‌క్కటం విశేషం.

Read more : CM Yogi : ప్రజలను మాఫియా నుంచి విముక్తుల్ని చేయడానికే రాజరాజకీయాల్లోకి వచ్చా: సీఎం యోగి

భార‌త ఫోటోగ్రాఫ‌ర్ సుప్ర‌తిమ్ భ‌ట్టాచార్జీ తీసిన ఫోటోకు యూనిసెఫ్ మొదటి అవార్డు గెలుచుకుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సుంద‌ర్‌బ‌న్స్ అనే కోస్తా ప్రాంతంలో నివ‌సించే ప్ర‌జ‌లు భారీ తుఫాను వ‌ల్ల న‌ష్ట‌పోయారు. అక్కడి దృశ్యాలను తన కెమెరాలో బంధించటానికి భారత ఫోటో గ్రాఫర్ సుప్ర‌తిమ్.. అక్క‌డికి వెళ్లారు. అక్కడి ప్రజలపై తుఫాను తీవ్రత ఎంతగా పడిందో ఆయన ఫోటోలు చూస్తే కళ్లకు కట్టినట్లుగా తెలుస్తుంది. ప్రజలు నష్టపోయిన తీరును సుప్రతిమ్ ఫోటోల ద్వారా తెలియజేశారు.

నామ్‌ఖానా ఐలాండ్‌లో చిన్న టీ షాప్ పెట్టుకొని జీవ‌నం సాగిస్తున్న ప‌ల్ల‌వి అనే బాలిక త‌న కుటుంబం ఈ తుపాను బీభత్సానికి ఎలా తల్లడిల్లిపోయారో..తుపాను ప్రభావానికి వారి చిన్నపాటి టీ కొట్టు కుప్పకూలిపోవటం..టీకొట్టు నీళ్ల‌లో కొట్టుకుపోవ‌డంతో వారి జీవితాలు ఎలా దిక్కుతోచ‌ని స్థితికి చేరారో తన ఫోటోలతో చూపించారు. టీకొట్టు నీళ్ల‌లో కొట్టుకుపోవ‌డంతో దీన స్థితిలో ఉన్నప్పుడు సుప్రతిమ్ తీసిన ఆ ఫోటో మొద‌టి స్థానంలో నిలిచింది.

Read more : Telangana : నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల పలు నెల‌ల పాటు స్కూళ్లు మూత‌ప‌డిపోయిన విషయం తెలిసిందే. ఈనాటికి చాలా ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి ఉంది. దీంతో పిల్లలు ఇంటికే పరిమితమైపోయారు. ఆన్‌లైన్ క్లాసులంటూ మొదలైనా పేద పిల్లలు ఆ స్మార్ట్ క్లాసుల్ని అటెండ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. స్మార్ట్‌ఫోన్ లేదా..లాప్‌టాప్ కొనుక్కోలేని పేద పిల్లలు చదువులకు దూరమైపోయారు. దీంతో దీప్ నారాయ‌ణ్ నాయ‌క్ అనే ఓ టీచ‌ర్ పేదరికం పిల్లలకు చదువును దూరం చేయకూడదనుకున్నారు. అలా ఆయన చేసిన ఓ వినూత్న ఆలోచన యూనిసెఫ్ అవార్డు భారత్ కు రావటానికి కారణమైంది.

పేద పిల్లలకు పాఠాలు చెప్పటానికి నారాయణ్ నాయక్ వీధి అరుగులనే పాఠశాలలుగా మార్చి ఇంటి గోడలనే బ్లాక్ బోర్డులుగా చేసి పిల్లలకు పాఠాలు చెప్పటం ప్రారంభించారు.సౌర‌వ్ దాస్ అనే భార‌త ఫోటోగ్రాఫ‌ర్ తీసిన ఈ ఫోటో యూనిసెఫ్ రెండవ అవార్డు గెలుచుకుంది. కరోనా మహమ్మారి వల్ల వచ్చిన లాక్ డౌన్ పంచ‌వ్యాప్తంగా 1.6 బిలియ‌న్ పిల్ల‌లు స్కూల్‌కు వెళ్ల‌లేక‌పోయారని యూనిసెఫ్ స్వయంగా వెల్ల‌డించింది.

 ఫస్ట్, సెకండ్ అవార్డులు భారత్ కు..మూడో ప్రైజ్ ఇరాక్‌కు

సంకల్పం ఉంటే కాళ్లు చేతులు లేకపోయినా స్ఫూర్తిగా నిలవవచ్చని నిరూపించిన ఓ వ్యక్తి గొప్ప ఆలోచన ఫోటోగా మారి..ఇరాక్ కు మూడవ ప్రైజ్ రావటానికి కారణమైంది.ఇస్లామిక్ స్టేట్ టెర్ర‌రిస్టుల‌తో జ‌రిగిన పోరులో చాలామంది పిల్ల‌ల తండ్రులు త‌మ జీవితాన్నే పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో యుద్ధంలో త‌న కాళ్లు చేతుల‌ను పోగొట్టుకున్న ఓ వ్యక్తి.. అటువంటి తండ్రుల‌కు తోడుగా పిల్ల‌లు భ‌విష్య‌త్తులో ఉంటారు అనే విధంగా ఇరాక్‌కు చెందిన ఫోటోగ్రాఫ‌ర్ యోనెస్ మ‌హ‌మ్మ‌ద్ తీసిన ఫోటోకు మూడో ప్రైజ్ ద‌క్కింది.

అలాగే మ‌రో 9 ఫోటోల‌ను కూడా జ్యూరీ ఎంపిక చేసింది. సిరియాలో బాంబుల వ‌ర్షం త‌ర్వాత అక్క‌డి వాతావర‌ణాన్ని పిల్ల‌లు ఎలా త‌ట్టుకున్నారు అనే అర్థం వ‌చ్చే ఫోటో అది. ఆ త‌ర్వాత ఇరాన్, నైజీరియా, జ‌ర్మ‌నీ, స్విట్జ‌ర్లాండ్, సింగ‌పూర్‌, జ‌ర్మ‌నీ, ఫిలిప్పైన్స్‌, ర‌ష్యాకు చెందిన ఫోటోలకు బ‌హుమ‌తులు ల‌భించాయి.

ట్రెండింగ్ వార్తలు