Telangana : నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. ఈరోజు అంతా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Telangana Ministers Visits Nalgonda
Telangana ministers visits nalgonda district : తెలంగాణ మంత్రులు నల్గొండ జిల్లా బాట పట్టారు. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 31,2021) ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రులు 10:30 గంటలకల్లా నల్లగొండకు చేరుకున్నారు. మంత్రులకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికాయి. బైక్ ర్యాలీలతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ,ఎస్టీ హాస్టల్, ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఐటీ హబ్ కార్యాలయానికి శంకుస్థాపనలు చేసారు.
Read more : Wedding Insurance: పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు..
అలాగే 12:30 గంటలకు బీట్ మార్కెట్లో వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ యార్డ్‌కు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు నల్లగొండ జైలుఖాన వద్ద రైతుబజార్, బస్తీల్లో ఏర్పాటు చేయటానికి స్థలాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ జిల్లాకు సంబంధించిన మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి..ఈ పనులన్నీ పూర్తి చేసుకుని మంత్రుల బృందం హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతారు.