CM Yogi : ప్రజలను మాఫియా నుంచి విముక్తుల్ని చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా: సీఎం యోగి

ప్రజలను మాఫియా నుంచి విముక్తుల్ని చేయడానికే రాజరాజకీయాల్లోకి వచ్చానని యూసీ సీఎం యోగి తెలిపారు.

CM Yogi : ప్రజలను మాఫియా నుంచి విముక్తుల్ని చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా: సీఎం యోగి

Up Cm Yogi Adityanath

UP CM Yogi Adityanath : ప్రజల్ని మాఫియా దోపిడీల నుంచి విముక్తులను చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం యోగీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గోరఖ్ పూర్ మఠాధిపతిగా ఉన్న తాను ప్రజలకు సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. మఠాధిపతిగా ఉన్న తాను రాజకీయాల వైపు నడిచిన ఆలోచనలను.. ఆ పరిస్థితుల గురించి సీఎం యోగి వెల్లడించారు. యూపీలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం యోగి రాజకీయ వాతావరణంపై ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు.

Read more : Food Delivery: ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీలపై బాదుడే.. రేపటి నుంచే!

మాఫియా వల్ల ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇళ్లను కూడా కోల్పోయారని.. చాలామంది బాధితులు తనకు ఫోన్ చేసిన చెప్పారని వారి బాధలువిన్న తనకు చాలా బాధకలిగేదని యోగి తెలిపారు. అటువంటి బాధితుల్లో ఓ ప్రముఖుడు కూడా ఉన్నారని తెలిపారు. ఆ వివరాలు చెబుతు..‘‘1994-95లో గోరఖ్ పూర్ లో ఒక ప్రముఖ కుటుంబం ఉండేది. వారికి రెండు చారిత్రక భవనాలు (హవేలీలు)ఉన్నాయి. ఆ రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వం మాఫియాకు కట్టబెట్టిందని..ఆ ప్రముఖ కుటుంబం రెండు భవనాలను నేలమట్టం చేసిందని అప్పుడు..సదరు బాధిత కుటుంబాన్ని కలిసి..పరిస్థితి గురించి తెలుసుకోగా..‘ఆ హవేలీలను కూల్చకపోతే మేం సర్వం కోల్పోవాల్సి వస్తుంది..భవనాలను కూల్చితే కనీసం తమకు భూమి అయినా ఉంటుంది’ అని వారు చెప్పారని యోగి తెలిపారు.

Read more : Telangana : నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అలాగే మరో ఘటనలో గోరఖ్ పూర్ లోనే ఓ శ్రీమంతుడు తనకు ఫోన్ చేసి..ఒక మంత్రి తన ఇంటిని కబ్జా చేశాడని చెప్పి తన బాధను వ్యక్తంచేశాడని తెలిపారు. అప్పుడు నేను అతని నివాసానికి వెళ్లాను. కానీ అప్పటికే అతని ఇంటినుంచి వస్తువులను బయటకు విసిరేస్తుండడం కనిపించిందని తెలిపారు. నేను వారిని అడ్డుకున్నాను…దాంతో వారు నా మొహాన పేపర్లను విసిరేసి నానా దుర్భాషలు ఆడారని తెలిపారు. ఇదంతా చూస్తుండిపోయాన ప్రజలతో నేను వారిని కొట్టాలని పిలుపునిచ్చానని తెలిపారు. ఇటువంటి ఘటనలు నన్ను రాజకీయాల్లోకి చేరేలా చేశాయని యోగి తెలిపారు.

Read more : Wedding Insurance: పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు..

అలా రాజకీయాల్లోకి వచ్చి నేను సీఎంని అయ్యాయని..తన పాలనలో మాఫియా అనే మాటే లేకుండాచేశానని..ఇప్పుడు యూపీలో ఎవరూ అటువంటి ఘటనలకు తావులేదని తెలిపారు. భూములను ఆక్రమించుకుంటే బుల్డోజర్లు వస్తాయని నేరగాళ్లు అందరికీ తెలుసనీ..అందుకే అటువంటి కబ్జా పనులు ఆగిపోయాయని.. మాఫియా అంటే మాఫియానే. దాన్ని కులంతో, మతంతో, ప్రాంతంతో ముడిపెట్టవద్దు. మాఫియా అనేది సమాజానికి శత్రువు అని అన్నారు.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 350 సీట్ల కంటే తక్కువ రావని నేను నమ్ముతున్నానని..యూపీలో సాధించిన విజయాలన్నీ కూడా ప్రధాని మోదీ నాయకత్వ స్ఫూర్తితోనే సాధ్యమయ్యాయి అని సీఎం యోగి వివరించారు. పర్యావరణాన్ని పాడుచేయాలని చాలామంది చూస్తున్నారని..కానీ వారి ఆటలు సాగనిచ్చేది లేదని సీఎం యోగి స్పష్టం చేశారు.