హౌడీ మోడీ : కిక్కిరిసిపోయిన హ్యూస్టన్ స్టేడియం

ఆరు రోజుల పర్యటన కోసం శనివారం రాత్రి అమెరికాలో కాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..ఇవాళ రాత్రి 9 గంటలకుహోస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమానికి హాజరై ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. హోస్టన్‌లోని ఎన్‌ ఆర్ జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు స్టేడియంకు చేరుకున్నారు. స్టేడియం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. సభలో తాను కొన్ని పెద్ద  ప్రకటనలు చేయనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.

అయితే ఏ అంశంపై ప్రకటన  చేస్తారన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. ట్రంప్‌ ప్రకటన భారత్-అమెరికాల  మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.అమెరికాలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్‌లో భారతీయ ప్రజలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది వ్యాపారాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించిన వారే. ట్రంప్‌ కూడా వ్యాపార వర్గానికి చెందిన వారు కావడం, వచ్చే ఏడాది అమెరిక అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండడంతో  హౌడీ – మోదీ సభకు ప్రాధాన్యత ఇస్తున్నారు ట్రంప్‌.

టెక్సాస్‌లో డెమొక్రాట్ల ప్రాభల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో డెమొక్రాట్ల డామినేషన్ కి చెక్ పెట్టి, ఇండియన్ అమెరికన్లను తన రిపబ్లికన్ పార్టీవైపు తిప్పుకోవాలంటే.. ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో… భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ ఈ సభకు హాజరవుతున్నారు