King Charles III: చార్లెస్-3కి ఉన్న అసాధారణ హక్కులేంటో తెలుసా.. పాస్‌పోర్టు కూడా ఉండదట!

బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించబోతున్న చార్లెస్-3కి బ్రిటన్ రాజవంశ చట్టాల ప్రకారం కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. ఈ హక్కుల ప్రకారం... ఆయనకు పాస్‌పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండదు.

King Charles III: క్వీన్ ఎలిజబెత్-2 తర్వాత బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు, ఆమె పెద్ద కుమారుడు చార్లెస్-3. రాజ వంశానికి చెందిన చార్లెస్-3 రాజుగా ఎంపికైనట్లే కానీ, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా, చార్లెస్-3కి కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్లు తెప్పించుకుందామనుకుంటున్నారా.. అయితే ఆగిపోండి.. ఎందుకంటే

చార్లెస్-3కి ఎలాంటి పాస్‌పోర్ట్ ఉండదు. దేశాధినేతలకైనాసరే పాస్‌పోర్ట్ ఉంటుంది. ఇలాంటివారికి ప్రత్యేక పాస్‌పోర్ట్ జారీ చేస్తుంటారు. కానీ, చార్లెస్-3కి మాత్రం ఎలాంటి పాస్‌పోర్ట్ లేదు. చార్లెస్-3 ఎలాంటి పాస్‌పోర్ట్, ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండానే ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఏ దేశానికైనా వెళ్లొచ్చు. అలాగే ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే బ్రిటన్‌లో ఎక్కడైనా వాహనం నడపొచ్చు. ఆయన పేరుతో పాస్‌పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మంజూరు చేయరు. ఈ నిబంధన చార్లెస్-3కి మాత్రమే వర్తిస్తుంది. చార్లెస్-3 తల్లి క్వీన్ ఎలిజబెత్‌కు రెండు పుట్టినరోజులు ఉండేవి. ఆమె అసలు పుట్టిన తేదీ ఏప్రిల్ 21

Amaravati Farmers: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి

అయితే, ప్రజలందరూ ఆమె పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు వీలుగా ప్రతి సంవత్సరం జూన్ రెండో మంగళవారాన్ని అధికారిక పుట్టినరోజుగా జరుపుతారు. దీని ప్రకారం చార్లెస్-3 కూడా రెండు పుట్టినరోజులు జరుపుకొనే అవకాశం ఉంది. ఆయన అసలు పుట్టిన రోజు నవంబర్ 14. ఇది వింటర్ కావడంతో సమ్మర్‌లో ఏదో ఒక రోజును పుట్టిన రోజుగా జరిపే అవకాశం ఉంది. ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇలా రెండు పుట్టినరోజులు జరుపుతారు. అలాగే ఆయనకు ఓటు హక్కు ఉండదు. అంటే చార్లెస్-3 ఎలాంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకోడు. అలాగే దేశంలో ఉన్న ఒక రకమైన హంసలను, వేల్స్‌ను రాజసంపదగా గుర్తిస్తారు.