అమెరికా హెచ్చరిక: ఐదు నెలల్లో భారతదేశ 25వేల చైల్డ్ పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలోకి

సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై చైల్డ్ పోర్న్ వీడియోలు భారత్ నుంచే ఎక్కువయ్యాయట. ఐదు నెలలుగా దాదాపు 25వేల పిల్లల అశ్లీల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయని రిపోర్ట్ లు చెబుతున్నాయి. అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్(ఎన్సీఎమ్ఈసీ) ఈ సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)తో పంచుకుంది.
చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటేరియల్ వీడియోలు అప్‌లోడ్ చేయడంలో ఢిల్లీనే టాప్ లిస్ట్‌లో ఉందట. ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ లు తర్వాత వరుసలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు చెప్పేందుకు మహారాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్ నికారించినప్పటికీ సగటున ఒక్కో రాష్ట్రం 17వందల కేసులు నమోదైనట్లు అంచనా.
దీనికి ఆపరేషన్ బ్లాక్ ఫేస్ అనే పేరుతో విచారణ చేస్తున్నాం. అటువంటి డేటాను సోషల్ మీడియాలో షేర్ చేసిన వాళ్లను త్వరలోనే కనుక్కొంటాం. ‘గతేడాది చైల్డ్ పోర్నోగ్రఫీ అరికట్టే దిశగా అగ్రిమెంట్ మీద సంతకం చేశాం. ఇందులో భాగంగానే ఎన్సీఎమ్ఈసీ మనకు రిపోర్టులు పంపిస్తుంది. జనవరి 23వరకూ 25వేల కేసుల వరకూ నమోదైయ్యాయని హోం మంత్రి అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఢిల్లీ టాప్‌లో ఉండటం, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పోలీసులు నిర్వహిస్తున్న సోదాలకు అనుగుణంగా అక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వీటిపై కొన్ని కేసులు నమోదయ్యాయి. ముంబై, థానె, పూణె వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క ముంబైలోనే 500 ఘటనలు జరగడమంటే మామూలు విషయం కాదు.