US Visas : ట్రావెల్ బ్యాన్ ఉన్నా..వీసాల జారీ ఆపకూడదన్న యూఎస్ కోర్టు..భారత ఐటీ నిపుణులకు ఊరట

కరోనా కట్టడిలో భాగంగా విధించిన ట్రావెల్ బ్యాన్ కారణంగా భారత్ నుంచి వచ్చే సాంకేతిక నిపుణులు సహా అర్హత ఉన్న ప్రయాణికులకు వీసాల జారీని అమెరికా విదేశాంగ శాఖ నిలిపివేయడం చట్టవిరుద్ధమని

Us

US Visas కరోనా కట్టడిలో భాగంగా విధించిన ట్రావెల్ బ్యాన్ కారణంగా భారత్ నుంచి వచ్చే సాంకేతిక నిపుణులు సహా అర్హత ఉన్న ప్రయాణికులకు వీసాల జారీని అమెరికా విదేశాంగ శాఖ నిలిపివేయడం చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్​ కోర్టు స్పష్టం చేసింది.

కొవిడ్​ ను సాకుగా చెబుతూ వీసాలు జారీ చేసేందుకు అమెరికా విదేశాంగ శాఖ నిరాకరించడంపై అమెరికన్​ ఇమ్మిగ్రేషన్​ లాయర్స్​ అసోసియేషన్​​ సాయంతో కొందరు వ్యక్తులు, ఇమ్మిగ్రేషన్​ లా సంస్థల కూటమి దాఖలు చేసిన పిటిషన్​పై బుధవారం విచారణ జరిపిన ఫెడరల్​ కోర్టు..కొవిడ్​ నివారణ కోసం విధించిన ప్రయాణ ఆంక్షలు ఉన్నా వీసాలను ప్రాసెస్ చేయడం​ ఆపకూడదని కోర్టు తెలిపింది.

అమెరికా విధించిన ప్రయాణ ఆంక్షల వల్ల సైన్స్​, టెక్నాలజీ, ఇంజనీరింగ్​ సహా పలు రంగాలకు చెందిన అమెరికన్ కంపెనీల ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీసా జారీ నిలిపివేయడం వల్ల స్వదేశాలకు వెళ్లిన ఐటీ నిపుణులు సహా పలువురు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా,కరోనా కట్టడిలో భాగంగా గతేడాది ప్రయాణాలపై అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఆంక్షలు విధించగా..కొత్త అధ్యక్షుడు జో బైడెన్​ వాటిని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.