US Elections 2024: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతలు రాజా కృష్ణమూర్తి, సుహాస్ విజయం
అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు నేతలు విజయం సాధించారు. ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివల్స్ లో

Raja Krishnamoorthi and suhas subramanyam
US Elections Results 2024: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు నేతలు విజయం సాధించారు. ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివల్స్ లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన రాజా కృష్ణమూర్తి విజయం సాధించాడు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్ ను దాదాపు 30వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. కష్ణమూర్తి 2016లో తొలిసారి అక్కడి నుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినోయీలో పలు పదవులు నిర్వహించారు. స్టేట్ ట్రెజరర్ గా కూడా ఆయన సేవలు అందించారు.
Also Read: US Elections Results 2024: ఉత్కంఠ భరితంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్.. విజయం దిశగా ట్రంప్
ఇదిలాఉంటే.. నార్తర్న్ వర్జీనియా పదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి భారత అమెరికన్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం విజయం సాధించాడు. ఒబామా హయాంలో ఆయన సాంకేతిక విధాన సలహాదారుగా పనిచేశారు. వర్జీనియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రాథమిక ఫలితాల ప్రకారం.. సుబ్రమణ్యం కు తన ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్ధి మైక్ క్లాన్సీపై విజయం సాధించాడు. సుబ్రహ్మణ్యంకు దాదాపు 53శాతం ఓట్లు పోలయ్యాయి.
Also Read: US Elections 2024 : కమలా హారిస్ vs డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు?
మరోవైపు ఇల్లినోయీలో డెమోక్రటిక్ పార్టీ హవా కొనసాగుతోంది. కమలా హారిస్ కు ఇల్లినోయీ రాష్ట్రం బలంగా నిలబడింది. దీనిలో కమల విజయం సాధించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటించింది. ఈ రాష్ట్రం నుంచి మొత్తం 14 ఎలక్టోరల్ ఓట్లు కమలకు లభించనున్నాయి. ఇక్కడ ట్రంప్ నకు 14,66,112 ఓట్లు రాగా.. కమలా హారిస్ కు 19,98,342 ఓట్లు పోలయ్యాయి.