False Shoplifting Charge : దొంగ అని ముద్ర..ఆ నిందే ఆమెను కోట్లకు అధిపతిని చేసింది..

చేయని తప్పుకు కుమిలిపోయిన ఓ మహిళ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవటానికి చేసిన పోరాటం ఆమెను కోట్లకు అధిపతిని చేసింది. దొంగ అని ముద్ర అని నింద వేసిన కంపెనీకు చుక్కలు చూపించింది.

False Shoplifting Charge Turns Woman Into Millionaire

False Shoplifting Charge Turns Woman Into Millionaire : చేయని తప్పు చేసారంటే చాలా బాదేస్తుంది. అటువంటిది ఏ పాపం తెలియకపోయినా దొంగ అని నింద వేస్తే ఇక వారి మనోవేదన గురించి చెప్పనక్కర్లేదు. అలా దొంగ అని నింద వేయించుకున్న ఓ మహిళ కుమిలిపోయింది. మనోవేదనకు గురైంది. అలాగని తల వంచుకుని నింద భరించి ఊరుకోలేదు.తాను చేయని తప్పుకు నేనెందుకు నింద భరించాలి? అనుకుంది.అన్నకున్నదే తడవుగా..తనపై దొంగ అని నింద వేసిన మల్టీ నేషనల్ రిటైల్ కంపెనీపై కోర్టులో పిటీషన్ వేసింది. తనకు న్యాయం చేయాలని తన మనోవేదనకు సదరు కంపెనీ సమాధానం చెప్పాలని న్యాయస్థానాన్ని కోరింది. ఆ చొరవ..తెగువే ఆమెను కోట్లకు అధిపతిని చేసింది.

Read more :  compensated Rs.1.8 cr : వివక్షకు భారీ మూల్యం..ఉద్యోగినికి రూ.1.8 కోట్ల పరిహారం..

యూఎస్ లోని అలబామాకు చెందిన లెస్లీ నర్స్‌ అనే మహిళ 2016లో వాల్‌మార్ట్‌ షాపింగ్ చేసింది. పలు రకాల వస్తువులు..చిరుధాన్యాలు వంటి నిత్యావసర వస్తువులతో పాటు మరికొన్ని వస్తువులు కొనుగోలు చేసింది. ఈ సమయంలో ఆమె వాల్డ్ మార్ట్ మాల్ లో దొంగతనం చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంతేకాదు తమ షాపులో 48 డాలర్లు(రూ. 3000) ఖరీదు చేసే తృణధాన్యలు, క్రిస్మస్‌ లైట్లు వంటి వస్తువులు దొంగలించిందని సదరు కంపెనీ ఆరోపించింది. కానీ ఆమె మాత్రం వాటి అన్నింటికి తాను డబ్బులు చెల్లించానని చెప్పింది. కానీ యాజమాన్యం ఆమె చెప్పినదాన్ని పెడచెవిన పెట్టింది.పైగా దొంగతనం చేసినందుకుగానూ తమకు 200 డాలర్లు(రూ. 14,000) చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాల్‌మార్ట్‌ యాజామన్యం లెస్లీని బెదిరించింది.

దీంతో లెస్సీ తీవ్ర మనోవేదనకు గురైంది. జరిగిన విషయాన్ని ఆ షాపు వాళ్లకు వివరించింది. తాను ఎటువంటి దొంగతనం చేయలేదని పదే పదే చెప్పింది. కానీ సదరు యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా ఆమెను అరెస్టు కూడా చేశారు. దీంతో ఆమె కుమిలిపోయింది. అలా కుమిలిపోతే తనపై పడిన నింద నిజమవుతుందని అది నిజం కాదని నిరూపించాలని నిశ్చయించుకుంది.

Read more : Private Hospital: వామ్మో..కోవిడ్‌ పేషెంటుకు రూ.1.8కోట్ల బిల్లు..!

దాంట్లో భాగంగా లెస్లీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. పోరాటం చేసింది. నిజాలను నిరూపించుకోవటానికి చేయాల్సిదంతా చేసింది. అన్ని సాక్ష్యాలను మొబైల్ కౌంటీ జ్యూరీకి చూపించింది. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాదు ఆమె స్టోర్‌లోని అన్ని వస్తువులకు చెల్లించిన‍ట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు ఆమెను దొంగతనం చేశావ్‌ అంటూ ఆరోపించి మానసిక ఆవేదనకు గురి చేసినందుకుగానూ నష్టపరిహారంగా వాల్‌మార్ట్‌ 2.1 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు)ను ఆమెకు చెల్లించవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది.దీంతో సదరు కంపెనీకి దిమ్మ తిరిగిపోయింది.