compensated Rs.1.8 cr : వివక్షకు భారీ మూల్యం..ఉద్యోగినికి రూ.1.8 కోట్ల పరిహారం..

మహిళా ఉద్యోగి పట్ల చూపించిన వివక్షకు భారీ మూల్యం చెల్లించుకుంది.కంపెనీ అభివద్దికి కృషి చేసిన ఉద్యోగిని పట్ల చూపించిన వివక్షకు ఫలితంగా రూ.1.8 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సివచ్చింది

compensated Rs.1.8 cr : వివక్షకు భారీ మూల్యం..ఉద్యోగినికి రూ.1.8 కోట్ల పరిహారం..

Compensated Rs.18 Cr

Female employee compensated rs.18 cr : ఉద్యోగులకు హక్కులు ఉంటాయి. అవి మగవారికి, ఆడవారికి ఒకేలా ఉంటాయి. అంతేకాదు మగ ఉద్యోగులకు ఒకలా..మహిళా ఉద్యోగులకు మరొకలా ఉండవు. కానీ కొంతమంది బాసులు మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తుంటారు. ఇంటి బాధ్యతల్లోను..ప్రకృతిపరంగాను మహిళా ఉద్యోగులకు కొన్ని బాధ్యతలు..మరికొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని గౌరవించాలి. కాదని కావాలని మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తే ఇదిగో ఇలాగే దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపిస్తుంది. తనపట్ల వివక్ష చూపించిన యాజమాన్యానికి ఓ ఉద్యోగిని చుక్కలు చూపెట్టింది. దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ విషయం ప్రతీ ఉద్యోగిని తెలుసుకోవాల్సిన ఓ సందేశాన్ని ఇచ్చింది ఈ మహిళా ఉద్యోగి.

అత్యవసర పరిస్థితుల్లో సెలవుల మంజూరు చేయడం..మహిళలకు సౌకర్యంగా ఉండేలా పనివేళల నిర్ణయించడం వంటి అంశాల విషయంలో సంస్థలు ఎటువంటి వివక్షా చూపించకూడదు. కానీ రియల్ ఎస్టేట్ సంస్థ మహిళా ఉద్యోగి పట్ల చూపించిన వివక్షకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వివక్షకు మూల్యంగా ఆమెకు ఏకంగా రూ.రూ.1.8 కోట్ల పరిహారం..చెల్లించాల్సి వచ్చింది.

Read more : Private Hospital: వామ్మో..కోవిడ్‌ పేషెంటుకు రూ.1.8కోట్ల బిల్లు..!

వివరాల్లోకి వెళితే..బ్రిటన్‌కు చెందని ఆలిస్ థామ్సన్ అనే మహిళ మేఫెయిర్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేసేది. పనిలో భాగంగా ఆమె ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆఫీసులోనే ఉండాల్సి వచ్చేది. ఇంటికి వెళ్లినా ఫోన్లకు సమాధానాలు చెప్పాల్సి వచ్చేది. అలా ఇంటిలోకూడా దాదాపు ఆఫీసు వర్కే చేసేది. ఆమె ఆదాయం 1.20 లక్షల పౌండ్లు.ఈక్రమంలో ఆలిస్ థామ్సన్ 2018లో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తరువాత ఆమె ఉద్యోగానికి వెళ్లాలి కాబట్టి బిడ్డను క్రచ్‌లో చేర్పించింది. కానీ సాయంత్రం ఆరు వరకూ ఆఫీసులోనే ఉండాల్సి రావడంతో.. క్రచ్ నుంచి పాపను తీసుకురావడం ఆలిస్‌కు ఇబ్బంది అయిపోయేది.

దీంతో..ఆమె కంపెనీ డైరెక్టర్ పాల్ సెల్లర్‌ తో మాట్లాడింది. తన పరిస్థితి గురించి చెప్పింది. నా పాపను దృష్టిలో పెట్టుకుని తనకు అనుకూలమైన వర్కింగ్ టైమ్ కేటాయించమని అడిగింది. టైమింగ్స్ లో మార్పులు చేయమని కోరింది. వీలైతే పార్ట్‌టైంగా ఉద్యోగం చేసేలా అవకాశం ఇవ్వాలని అభ్యర్థించింది. కానీ పాల్ ఒప్పుకోలేదు. మీ ఇంటి సమస్యల గురించి నేను నష్టపోవాలా?అదే కుదరదు..ఎప్పుడు చేసినట్లే చేయాలని అదే టైముకు ఆఫీసుకు రావాలని..నువ్వు అడినట్లు చేస్తే నాకు ఆర్థికంగా నష్టమొస్తుందని కాబట్టి కుదరదు అని తెగేసి చెప్పాడు.దాంతో ఆలిస్ షాక్ అయ్యింది. ఇన్ని సంవత్సరాలుగా మీ కంపెనీలో పనిచేస్తున్నాను..ఇన్నాళ్లు నేను ఎప్పుడు ఏమీ అడగలేదు. నా డ్యూటీలో ఏమాత్రం పొరపాట్లు చేయలేదు. కంపెనీ అభివద్ధి కోసం పాటు పడ్డాను..ఇప్పుడు మీరు ఇలా అనటం కరెక్ట్ కాదు మరోసారి ఆలోచించమని అడిగింది. కానీ పాల్ ఒప్పుకోలేదు.

దీంతో ఆలిస్ మానసికంగా బాధపడింది. తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్న నా విషయంలో సంస్థ ఇలా వ్యవహరించటం సరైంది కాదు అని పదే పదే అనుకుంది. కింది స్థాయిలో ఉద్యోగ జీవితం నుంచి ఆమె కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ మేనేజర్ స్థాయికి చేరుకున్నాను..ఇంతకాలం కష్టానికి ఇదేనా ప్రతిఫలం అని తనను తాను ప్రశ్నించుకుంది. సంస్థతో ఇంత సుదీర్ఘ అనుబంధం ఉన్న తన అభ్యర్థనను పాల్ తిరస్కరించడం ఆలిస్‌ను మానసికంగా గాయపరించింది. ఓ తల్లిగా తన బాధ్యత విషయంలో అభ్యర్థించినా ఇంత దురుసుగా వ్యవహించటం పట్ల ఆమె భరించలేకపోయింది. తనపై సంస్థ వివక్ష చూపిస్తోందని ఆలిస్ భావించింది. నాకు జరిగిన ఈ అన్యాయం గురించి ప్రశ్నించాల్సిందేనని నిర్ణయించుకుంది. దీంతో.. ఉద్యోగానికి రాజీనామా చేసిన న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకంది. స్త్రీ అయిన కారణంగానే తాను సంస్థలో వివక్ష ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆలిస్ ఉద్యోగుల ట్రిబ్యునల్‌లో కేసు వేసింది.

2019లో ఉద్యోగానికి రిజైన్ చేసిన అనంతరం ఆలిస్.. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా తాజాగా ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువడింది. సదరు కంపెనీ తన చర్యల ద్వారా ఆలిస్‌పై పరోక్షంగా వివక్ష ప్రదర్శించిందని పేర్కొన్న ట్రిబ్యునల్.. ఆమెకు 1.85 లక్షల పౌండ్లు అదే భారత కరెన్సీలో 1.8 కోట్లు పరిహారం చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. ఆమె జీతభత్యాలు, పెన్షన్ రూపంలో ఇంతకాలంగా ఆలిస్ నష్టపోయిన సొమ్మును ఆమెకు తిరిగి చెల్లించాలని తీర్పిచ్చింది. దీంతో సదరు కంపెనీకి దిమ్మతిరిగిపోయింది. కాస్త న్యాయంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు కదాని వాపోయింది.