Private Hospital: వామ్మో..కోవిడ్‌ పేషెంటుకు రూ.1.8కోట్ల బిల్లు..!

కరోనా చికిత్స పొందిన పేషెంట్ కు ఓ ప్రైవేటు హాస్పిటల్ రూ.1.8 కోట్ల బిల్ వేసింది. ఈ బిల్ చూసిన సదరు పేషెంట్ కు..కుటుంబ సభ్యులకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది..!

Private Hospital: వామ్మో..కోవిడ్‌ పేషెంటుకు రూ.1.8కోట్ల బిల్లు..!

Covid Patient Treatment Rs 1.8 Crore Bill

Private Hospital Covid treatment bill: కరోనా పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్ పేషెంట్ల ప్రాణాలు రక్షించటం అటుంచి బిల్లుల రూపంలో బికారుల్ని చేస్తున్నాయి. కరోనా ట్రీట్ మెంట్ చేయించుకున్న ఓ పేషెంటుకు ఢిల్లీలోని ప్రైవేటు హాస్పిటల్ ఏకంగా రూ.1.8 కోట్ల బిల్లు వేసింది. ఆ బిల్లు చూసిన సదరు పేషెంట్ తో పాటు వారికుటుంబ సభ్యులకు కూడా హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది.

కరోనా ట్రీట్ మెంట్ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంచిన మేరకు ఫీజులు తీసుకోవాలని తెలిపాయి. అలాగే న్యాయస్థానాలు కూడా పలు సూచనలు చేశారు. కానీ ప్రైవేటు హాస్పిటల్స్ వారి దందా ఆపలేదు. లక్షల రూపాయలు బిల్లలు వేసి సదరు పేషెంట్ చనిపోయాని అణాపైసలతో సహా బిల్లలు కట్టించుకున్నారు. అలా పైసా పైసా వసూలు చేస్తేనే గానీ మృతదేహాన్ని కూడా ఇవ్వని కర్కోటకులుగా మారిన పరిస్థితి.

ఈక్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి కోవిడ్ చికిత్సకు 51 ఏళ్ల రోగి నుంచి రూ.1.8 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి రావడంతో షాక్ అవుతున్నారు. మరీ ఇంత బిల్లా అని ఆశ్చర్యపోతున్నారు.

Read more : compensated Rs.1.8 cr : వివక్షకు భారీ మూల్యం..ఉద్యోగినికి రూ.1.8 కోట్ల పరిహారం..

ఈ బిల్లు ఘటనపై ఆమ్-ఆద్మీ పార్టీ మాళవ్య నగర్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి మాక్స్ హాస్పిటల్‌పై విరుచుకపడ్డారు. సాకేత్‌లోని మాక్స్‌లో నాలుగు నెలల నుంచి కోవిడ్‌ చికిత్స పొందిన రోగికి 1.8 కోట్ల బిల్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు .అంత ఖర్చు ఎందుకు అయ్యింది. ఇంత బిల్లు వేయాల్సినంత ఖర్చు ఎందుకు అయ్యిందని ప్రశ్నించారు. ఆ రోగి ఏప్రిల్ నెలాఖరులో కోవిడ్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారని కానీ ఇంత భారీ బిల్లు వేయాల్సినంత ఖర్చు ఉంటుందా? ఇది మరీ దారుణం అని అన్నారు.

ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరి ఎంత చికిత్స అందించినప్పటికీ.. ఇంతలా బిల్లు వేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ..కోవిడ్‌ రోగి టైప్ -2 డయాబెటిక్, హైపర్‌టెన్సివ్, పిత్తాశయం ఇన్ఫెక్షన్, మెదడు పనితీరు క్షీణించడం వంటి పలురకాల సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు సవాలుగా మారిందని.. దాదాపు నాలుగు నెలల పాటు అతనికి ట్రీట్ మెంట్ చేశామని అందుకే అంత ఖర్చయినట్లు ఆసుపత్రి తెలిపింది.

ఈ కోవిడ్ బిల్ విషయంపై కాంగ్రెస్‌ ఎంపీ మనీష్ తివారీ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయాకు ఓ లేఖ రాశారు. ఇటువంటి దోపిడీలను నియంత్రించటానికి అధికారులను నియమించాలని.. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి సదరు హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటివి నియంత్రించేందుకు ప్రభుత్వం ఓ బిల్లును తీసుకురావాలంటూ మనీష్‌ తివారీ ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయాను కోరారు. అంతేకాకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కోరారు.రోగి నుంచి ఆసుపత్రి యాజమాన్యం ఇంత భారీ మొత్తంలో ఎలా వసూలు చేస్తుందని ఎంత చికిత్స చేస్తే మాత్రం 1.8 బిల్లు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.

కాగా..ఈ వివాదం విషయంపై సదరు రోగి భార్య స్పందిస్తూ..”ఈ వివాదంలో తమ పేరు లాగడం ఇష్టం లేదని” అని కోరటం గమనించాల్సిన విషయం. సదరు హాస్పిటల్ వేసిన బిల్లు విషయంలో మేము ఎమ్మెల్యే భారతిని సంప్రదించామని తెలిపారు. కానీ బిల్లు మొత్తాన్ని చెల్లించామని ఇక దీనిపై వ్యాఖ్యానించటం మాకు ఇష్టం లేదని తెలిపారు.కాగా సదరు కోవిడ్ పేషెంట్ ఆగస్టు 16న హాస్పిటల్ లో జాయిన్ అయ్యి సెప్టెంబర్ 6న డిశ్చార్జ్ అయ్యాడు.