gray rat snake from toilet
Snake In Toilet: యూస్‌లోని అలబామా యుఫాలా ప్రాంతంలో ఓ కుటుంబానికి వారి ఇంట్లో ఓ భయంకరమైన సన్నివేశం కనిపించింది. ఊహించలేని విధంగా వాళ్ల టాయిలెంట్‌లో పాము కనిపించింది. దానిని చూసి వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అది గ్రే ర్యాట్ స్నేక్ అని తేలింది.
Snake Catcher Died Of Cobra Bite : 20 ఏళ్లుగా పాములు పట్టాడు.. చివరికి పాము కాటుకే..
కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని యూఫాలాలోని పోలీసులకు తెలిపారు. వారు వచ్చి పామును బయటకుతీసి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వదిలారు. ఇందుకు సంబంధించి పోలీస్ శాఖ అధికారిక ఫేస్ బుక్ పేజీలో టాయిలెట్ లోపల ఉన్న పాము చిత్రాలతో పాటు వినోధభరితమైన పోస్ట్‌ను షేర్ చేశారు.
Snake
“మా షిఫ్ట్ సమయంలో మేము ఎలాంటి కాల్ స్వీకరిస్తామో మాకు తెలియదు. ఈ రోజు మినహాయింపు కాదు. అయితే టాయిలెట్‌లోని పాము అనేది మేము ఊహించనిదే. డే షిఫ్ట్ లో మాకు వచ్చిన సమాచారంతో ఘటన స్థలికి వెళ్లాము. ఆ పామును దాని అనుకూల ప్రాంతంలో వదిలేశాము. ఆ పాము హానిచేయని గ్రే ర్యాట్ స్నేక్. అని పేర్కొన్నారు.