Snake Catcher Died Of Cobra Bite : 20 ఏళ్లుగా పాములు పట్టాడు.. చివరికి పాము కాటుకే..
ఎంతటి విషపూరితమైన పామునైనా అవలీలగా పట్టి.. స్నేక్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి.. చివరికి పాముకాటుకే బలయ్యాడు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన వినోద్ తివారీ పాము కాటుకు బలైపోయాడు. విషపూరిత నాగుపామును పట్టుకునే సమయంలో దాని కాటుకు గురై తివారీ మృతి చెందాడు.

Snake Catcher Died Of Cobra Bite
Snake Catcher Died Of Cobra Bite : అతను పాములతో ఆడుకుంటాడు.. పాములతో స్నేహం చేస్తాడు.. జనమంతా పాములను చూసి బెదిరిపోతే.. అతను మాత్రం వాటిని పట్టుకుని అడవుల్లో వదిలిపెడతాడు.. 20 ఏళ్లుగా పాములతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్న అతడిని పాములే బలితీసుకున్నాయి. ఎంతటి విషపూరితమైన పామునైనా అవలీలగా పట్టి.. స్నేక్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి.. చివరికి పాముకాటుకే బలయ్యాడు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన వినోద్ తివారీ పాము కాటుకు బలైపోయాడు.
విషపూరిత నాగుపామును పట్టుకునే సమయంలో దాని కాటుకు గురై తివారీ మృతి చెందాడు. చురులోని గోగమేడి ప్రాంతంలోని ఓ దుకాణంలోకి వచ్చిన నాగుపామును పట్టుకోవడానికి తివారీ అక్కడికి వెళ్లాడు. దుకాణం బయట నాగుపామును పట్టుకుని, దాన్ని సంచిలో వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే పాము అతని వేలు మీద కాటు వేసింది. ఇదంతా అక్కడి సీసీటీవీ వీడియోలో రికార్డ్ అయ్యింది.
Telangana : పాములు పట్టే వ్యక్తి పాము కాటుతో మృతి
అతను పట్టుకున్న ఆ పాము అత్యంత విషపూరితమైనది కావడంతో.. పాము కాటు వేసిన నిమిషాల వ్యవధిలోనే తివారి మృతి చెందాడు. గోగమేడి ప్రాంతంలో.. ఎక్కడ పాము కనిపించినా.. సమాచారం అందించగానే వినోద్ తివారీ వచ్చి పాములను పట్టేవాడు. ఆ తర్వాత వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేసేవాడు.