చనిపోయిన కొడుకు ‘గుండె చప్పుడు’ వింటున్న తండ్రి..గుండెను పిండేసే దృశ్యం..

చనిపోయిన కొడుకు ‘గుండె చప్పుడు’ వింటున్న తండ్రి..గుండెను పిండేసే దృశ్యం..

Updated On : January 2, 2021 / 3:46 PM IST

US : dead son’s heartbeat Father emotional : చనిపోయిన కొడుకు గుండె చప్పుడు వింటున్న తండ్రి..గుండెను పిండేసే దృశ్యం ఓ తండ్రి తన కళ్లముందే చనిపోయిన కొడుకును చూసి కుమిలిపోయాడు. కానీకొంతకాలానికి ‘‘చనిపోయిన తన కొడుకు గుండె చప్పుడు’ వింటూ గుండెలవిసేలా ఏడ్చాడు. ఓ పక్క కొడుకు ‘గుండె చప్పుడు’’ మరో పక్క కొడుకును కోల్పోయిన ఆ తండ్రి కన్నీరు వెల్లువలా కారుతోంది.

    

కొడుకు గుండె చప్పుడు వింటున్న ఆ తండ్రి ‘ మైడియర్ సన్’’ నువ్వెప్పటికీ ఈ తండ్రి గుండెల్లో బతికే ఉంటావురా..నీకు మరణం లేదు. నేను చనిపోయినా నీ గుండె చప్పుడుతో బతికే ఉంటావు అంటూ కన్నీటి సంద్రమైపోయాడు..చనిపోయిన కొడుకు గుండె చప్పుడు తండ్రి వినటమేంటీ అను అనుకుంటున్నారు కదూ..అయితే గుండెను పిండేసే ఈ తండ్రీ కొడుకుల గుండె చప్పుడు గురించి..

అమెరికాకు చెందిన జాన్‌ రెయిడ్‌ ఓ ప్రమాదంలో తన 16 ఏళ్ల కొడుకుని కోల్పోయాడు. 2019 లో డిన్విడ్డీ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాన్‌ రెయిడ్‌ కుమారుడు మరణించాడు. దీంతో తన కొడుకు చనిపోయినా ఆ బాధలో కూడా జాన్ రెయిడ్ పెద్ద మనస్సు చేసుకున్నాడు. తన కొడుకు తనకు దూరమైనా మరికొంతమంది జీవించాలనుకున్నాడు. దీంతో తన కొడుకు అవయవాలను దానం చేసి మరి కొందరికి ప్రాణం పోశాడు జాన్‌ రెయిడ్‌.

అలా జాన్ రెయిడ్ కొడుకు అవయవాలు అమర్చుకున్నవారిలో మసాచుసెట్స్‌కు చెందిన రాబర్ట్ ఓ’కానర్‌ ఒకడు. రాబర్ట్‌ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ తప్పనిసరి అని డాక్టర్లు తెలిపారు. దీంతో బతకాలనే ఆశతో కొట్టుమిట్టాడుతున్న రాబర్ట్ కు జాన్‌ రెయిడ్‌ కుమారుడి గుండెని డాక్టర్లు అతడికి అమర్చారు.

అలా హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ విజయవంతం అయ్యింది. రాబర్ట్‌ కోలుకున్నాడు. కోలుకుని ఇంటికి వెళ్లిన తరువాత తన ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు కారణం తనకు గుండెను దానం చేసినవారి పుణ్యమేనని వారికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతన్ని దేవుడిగా భావించి ధన్యవాదాలు తెలిపాడు.

ఆ తరువాత తనకు గుండె దానం చేసి..పునర్జన్మనిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నాడు. దాంతో తన ‘గుండె చప్పుడు’ని రికార్డు చేసి.. ఓ టెడ్డీ బేర్ బొమ్మలో దాన్ని అమర్చి.. దాన్ని జాన్ రెయిడ్‌కు గిఫ్టుగా పంపించాడు. నన్ను కూడా మీ కొడుకే అనుకోండి అంటూ తెలిపాడు.

రాబర్ట్‌ పంపిన గిఫ్ట్‌బాక్స్‌ని ఒపెన్‌ చేసిన రెయిడ్‌ దానిలోని టెడ్డీ బేర్ బొమ్మను బయటకు తీసి చెవి దగ్గర పెట్టుకుని చనిపోయిన తన కొడుకు ‘గుండె చప్పుడు’ విన్నాడు. ఒక్కసారిగా ఆపుకోలేని భావోద్వేగానికి గురయ్యాడు. స్వయంగా కుమారుడే తన దగ్గర ఉన్నట్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు రెయిడ్‌. ఆ గుండె చప్పుడు వింటూ కన్నీటి తడిసిపోయాడు.

ఈ దృశ్యాన్ని రెయిడ్‌ భార్య వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక టెడ్డీ బేర్‌ షర్ట్‌ మీద ‘బెస్ట్‌ డాడ్‌ ఎవర్’‌ అని ఉంది. ఆ కోట్‌ని నిజం చేసి చూపారని నెటిజనులు రెయిడ్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. మీరే నిజమైన తండ్రి అంటూ భావోద్వేగాన్ని వ్యక్తంచేస్తున్నారు.