US Federal Reserve : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు 75 bps పెంపు..1994 తర్వాత భారీ పెంపు

సెంట్రల్ బ్యాంక్ రేట్ల పెంపును ప్రకటిస్తూ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి తిరిగి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రాబోయే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని, నిరుద్యోగ రేటు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

US Federal Reserve : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 75 bps పెంచింది. ఇది 1994 తర్వాత భారీ పెంపుగా చెప్పవచ్చు. జూన్ 15న US ఫెడరల్ రిజర్వ్ తన లక్ష్య వడ్డీ రేటులో మూడో వంతు శాతం పాయింట్ లేదా 75 bps పెంచుతున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికే వడ్డీ రేటు పెంచుతున్నట్లు పేర్కొంది. మే నెలలో వినియోగ ధరల ద్రవ్యోల్బణం 8.6 శాతానికి చేరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో 1981 తర్వాత ఇంధనం, ఆహార ఖర్చులు అత్యధికం పెరిగాయి.

సెంట్రల్ బ్యాంక్ రేట్ల పెంపును ప్రకటిస్తూ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి తిరిగి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రాబోయే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని, నిరుద్యోగ రేటు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఫెడ్ ప్రకటించిన 75 bps రేటు పెంపు..1994 తర్వాత అతి భారీ పెంపు అని తెలిపింది. రాబోయే రోజుల్లో రుణ వ్యయాలు కూడా వేగంగా పెరుగుతాయని సెంట్రల్ బ్యాంక్ అధికారులు తెలిపారు.

Illegal Liquor: రూ. 2.14కోట్ల మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించారు.. ఎక్కడంటే..

ఉక్రెయిన్ యుద్ధం, చైనా లాక్‌డౌన్ విధానాలు ద్రవ్యోల్బణానికి కారమణని ప్రకటించారు. కరోనా మహమ్మారి, అధిక ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందని సెంట్రల్ బ్యాంక్ పాలసీ సెట్టింగ్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన రెండు రోజుల సమావేశం ముగింపు రోజు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఫెడరల్ ఫండ్స్ రేటును 1.50 శాతం నుండి 1.75 శాతానికి పెంచింది. ఇది

ఈ సంవత్సరం చివరి నాటికి 3.4 శాతానికి, 2023లో 3.8 శాతానికి పెరుగుతుందని ఫెడ్ అధికారులు అంచనా వేశారు. ఈ సంవత్సరం వృద్ధి రేటు 1.7 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి నిరుద్యోగం 3.7 శాతానికి పెరగనుంది. అది 2024 నాటికి 4.1 శాతానికి పెరుగుతుంది. ద్రవ్యోల్బణం ఫెడ్‌కి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సమస్యగా మారింది.

ట్రెండింగ్ వార్తలు