Illegal Liquor: రూ. 2.14కోట్ల మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించారు.. ఎక్కడంటే..

మీరు చూస్తున్న ఫొటోల్లో ఉన్నది మద్యం సీసాలే.. గ్రాఫిక్స్ కాదు.. అయ్యయ్యో.. ఇన్ని మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్నారేంటి అని అనుకుంటున్నారా.. అవన్నీ కొందరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు. వీటి విలువ రూ. 2.14 కోట్లు ఉంటుంది.

Illegal Liquor: రూ. 2.14కోట్ల మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించారు.. ఎక్కడంటే..

Liquor (1)

Illegal Liquor : మీరు చూస్తున్న ఫొటోల్లో ఉన్నది మద్యం సీసాలే.. గ్రాఫిక్స్ కాదు.. అయ్యయ్యో.. ఇన్ని మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్నారేంటి అని అనుకుంటున్నారా.. అవన్నీ కొందరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు. వీటి విలువ రూ. 2.14 కోట్లు ఉంటుంది. ఇన్ని మద్యం సీసాలను బుధవారం ప్రకాశ్ జిల్లా ఒంగోలు శివారు ప్రాంతంలో రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ మలికగర్ సమక్షంలో అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం జరిగింది.

Liquor

Illegal Liquor: నెల్లూరు జిల్లాలో మద్యం అక్రమ రవాణా

జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎస్ఈబీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి తెస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. దీంతో జిల్లాలోని ఎస్ఈబీ స్టేషన్లలో 904 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోని పలు రకాల మద్యం బ్రాండ్లకు చెందిన 42,810 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. వీటి విలువ రూ. 2.14 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో వీటిని బుధవారం రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ ఫొటోల్లో మద్యం బాటిళ్లను చూస్తే మద్యం ప్రియుల మనస్సు చివుక్కు మనడం ఖాయం..!

Liquor (2)