మహిళా జడ్జీపై మనసుపడ్డ నేరస్థుడు :శిక్ష గురించి చెబుతుండగా I Love you చెప్పిన ప్రబుద్ధుడు

perpetrator to the female judge Love Proposal : ‘ప్రేమ’ ఎప్పుడు ఎవరి మీద ఎలా ఎందుకు కలుగుతుందో చెప్పలేనిది. ప్రేమించినవాళ్లు పేదా? గొప్పా?నేరస్థులా? ఉన్నతస్థాయిలో ఉన్నవారా? అనేది తెలియదు. ఒకరిపై మరొకరికి ప్రేమ కలగటానికి ఒక్క క్షణం చాలు. దాన్ని ‘లవ్ ఎల్ ఫస్ట్ సైట్’ అని అన్నా..మరొకటి అన్నా పోయేదేంలేదు. అటువంటి ప్రేమ పుట్టింది ఓ నేరస్థుడి. ఎవరిమీదంటే సాక్షాత్తూ తాను చేసిన నేరాల గురించి శిక్ష విధించే జడ్జీ మీద ప్రేమ కలిగిందా నేరస్థుడికి..!!
ఓ మహిళా జడ్జీమీద మనసు పారేసుకున్నాడో నేరస్థుడు. ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. కోర్టులోనే I Love you కూడా చెప్పేశాడు. దానికా జడ్జీ షాక్ అయ్యింది. తరువాత ముసిముసిగా నవ్వేసుకుంది. ఎందుకంటే ఆడవాళ్లను ఎవరైనా అందంగా ఉన్నావు అంటే చాలా హ్యాపీ ఫీలైపోతారని అందరూ అంటుంటారు. బహుశా ఆమె కూడా అలాగే ఫీల్ అయి ఉంటారు. తరువాత ‘‘నీ పిచ్చి వేషాలు నాదగ్గర కుదరవ్..నువ్వు చేసిన నేరాలకు శిక్ష అనుభవించాల్సిందేనింటూ తేల్చి చెప్పింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ విచిత్ర ప్రపోజల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి ఓ దొంగతనం కేసులో పోలీసులకు పట్టుపడ్డాడు. యూఎస్ లో కరోనా కేసుల నేపథ్యంలో సదరు నేరస్థుడిని జూమ్ కాల్ ద్వారా తబితా బ్లాక్‌మాన్ అనే మహిళా జడ్జి ముందు హాజరుపరిచారు. ఆ కేసుకు గురించి పూర్తిగా విచారించిన జడ్జి నిందితుడి శిక్షకు సంబంధించిన పత్రాన్ని చదువుతుండగా లూయిస్ ఒక్కసారిగా జడ్జీతో.. ‘మీరు చాలా అందంగా ఉన్నారు.. మీతో ఈ మాట చెప్పేతీరాలి .. ఐ లవ్ యూ..’ అని చెప్పేశాడు.
దీంతో ఆ వీడియో కాల్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు సదరు మహిళా జడ్జీతో సహా. అయితే లూయిస్ ప్రపోజల్ విన్న లేడీ జడ్జి .. ‘పొగడ్తలు నువ్వు ఎక్కడైనా ఉపయోగపడచ్చు కానీ ఇక్కడ మాత్రం ఆ పొగడ్తలు పనిచేయవు’ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.