చైనా ఆదేశాల ప్రకారమే భారత సైనికులపై క్రూర దాడి, అమెరికా ఇంటెలిజెన్స్
తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ ఉద్దేశపూర్వకంగానే జరిగింది? చైనా ప్రభుత్వం ఆదేశాల

తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ ఉద్దేశపూర్వకంగానే జరిగింది? చైనా ప్రభుత్వం ఆదేశాల
తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ ఉద్దేశపూర్వకంగానే జరిగింది? చైనా ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే భారత సైనికులపై దాడి చేశారా? దీని వెనుక కుట్ర కోణం ఉందా? అమెరికాతో భారత్ స్నేహంగా ఉండటం చైనాకు నచ్చడం లేదా? అంటే అవుననే అంటున్నాయి అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు. జూన్ 15న గల్వాన్ లో చైనా-భారత్ సైనికుల మధ్య తీవ్రమైన హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా ఆర్మీకి కూడా భారీగానే ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం. 43మందికిపైగా చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. చైనా సైనికులు దొంగ దాడి చేశారు. ముందు మన భూభాగంలోకి చొరబడి టెంట్లు వేశారు. వాటిని తొలిగించేందుకు వెళ్లిన మన సైనికులపై పథకం ప్రకారం రాళ్లు, పదునైన ఆయుధాలు, మేకులు చుట్టిన రాడ్లతో దాడి చేశారు. కొంతమందిని నదిలోకి తోసేశారు. వాళ్లు 300 మంది, మనవాళ్లు 100 మంది. చుట్టూ శత్రు బలగాలు.. అయినా మన సైనికులు భయపడలేదు. సింహాల్లా గర్జించారు. వీరోచితంగా పోరాటం చేశారు. చైనా సైనికులను తీవ్రంగా ప్రతిఘటించారు.
చైనా బలం ఏంటో అమెరికా మిత్ర దేశాలకు చూపించాలని:
జనరల్ జో జోంగి. చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి పని చేస్తున్నాడు. ఈ ఆపరేషన్ కు అనుమతి ఇచ్చింది ఆయనే అని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. చైనా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జో ఇదంతా చేశాడట. జో హుకుం మేరకు చైనా సైనికుల మనోళ్లను రెచ్చగొట్టి క్రూరమైన దాడులకు తెగబడ్డారు. అమెరికా దాని మిత్రదేశాలు చైనాని బలహీన దేశంగా చూస్తున్నాయని, మన సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతో జనరల్ జో జోంగి ఈ దాడులకు ఆదేశాలు ఇచ్చారట. చైనాని బలహీనంగా భావిస్తున్న అమెరికా, దాని మిత్రదేశాలకు గట్టి హెచ్చరిక పంపాలనే ఉద్దేశ్యంతో ఈ దాడులకు ఆయన ఆర్డర్ ఇచ్చారని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
భారత్ కు గుణపాఠం నేర్పాలని:
కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికాతో భారత్ సన్నిహితంగా ఉంటోంది. అయితే అమెరికాని శత్రువుగా చూస్తోంది చైనా. ఈ క్రమంలో శత్రువుతో చేతులు కలిపే దేశాలని, సన్నిహితంగా ఉంటున్న దేశాలను కూడా చైనా శత్రువులానే చూస్తోంది. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలని, భారత్ కు ఓ గుణపాఠం నేర్పాలని చైనా ఆర్మీ దాడులకు తెగబడినట్టు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ దాడుల ముఖ్య ఉద్దేశం చైనా బలం ఏంటో భారత్ కు తెలియజేయడమే. మా శత్రువులతో చేతులు కలిపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడమే. అమెరికాతో చేతులు కలిపిన ఇండియా, వారు చెప్పినట్టు వింటోంది అనేది చైనా ఆరోపణ. చైనాకు కాంట్రాక్టులు రద్దు చేయడం, వారి ఉత్పత్తులు బాయ్ కాట్ చేయడం, వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడం… ఇవన్నీ అమెరికా ఆదేశాల మేరకు భారత్ తీసుకుంటోంది అని చైనా విశ్వసిస్తోంది. ఈ క్రమంలో భారత్ పై కోపం పెంచుకున్న చైనా తమ సత్తా ఏంటో చూపించి భయపెట్టాలని భారత్ ఆర్మీపై దాడి చేయించిందని సమాచారం.
Read: సరిహద్దు వివాదం.. భారత్‌పై దూకుడు పెంచిన నేపాల్.. కొత్త పౌరసత్వ చట్టం