The Paradise : మళ్ళీ వాయిదా అంటున్న ‘ది ప్యారడైజ్’.. నిరాశలో నాని ఫ్యాన్స్..
నేచురల్ స్టార్ నాని కెరీర్లో హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ది ప్యారడైజ్. (The Paradise)
The Paradise
The Paradise : వెల్కమ్ టు జడల్ జమానా అంటూ ది ప్యారడైజ్ సినిమా అప్డేట్స్ ఇస్తోన్న నాని అసలు విషయం మాత్రం చెప్పడం లేదు. మార్చి నుంచి ఏకంగా 5 నెలలు వెనక్కెళ్లిన ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారుతుందనే న్యూస్ వైరలవుతోంది.
నేచురల్ స్టార్ నాని కెరీర్లో హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటివరకు రివీలైన ప్రమోషనల్ కంటెంట్ సైతం ఈ అంచనాల్ని రెట్టింపు చేస్తున్నాయి. అయితే మార్చి 19 నుంచి ఆగస్ట్ 21కి షిఫ్ట్ అయిన ప్యారడైజ్ మళ్లీ వాయిదా పడుతుందనే న్యూస్ వినిపిస్తోంది.
ది ప్యారడైజ్ సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తోన్నాడు బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జయల్. కొన్ని రోజుల క్రితం వచ్చిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌తో వాయిదాపై క్లారిటీ వచ్చిందంటున్నారు జనాలు. ఎక్కడా కూడా సినిమా రిలీజ్ ఆగస్ట్ 21 అని మెన్షన్ చేయకపోవడంతో ఈ పోస్ట్‌పోన్ రూమర్స్ నిజమయ్యే చాన్సెస్ ఉన్నాయని ఫిక్సయ్యారంతా. అయితే ఆన్‌టైమ్ పూర్తి కావాల్సిన టాకీ పార్ట్ సహా సినిమాకి సంబంధించిన సాంగ్ షూట్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయట. షూటింగ్ ని సాగదీస్తూనే ఉన్నారని సమాచారం. ఈ కారణాలతోనే ఆగస్ట్ నుంచి ప్యారడైజ్ ఆల్మోస్ట్ ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటున్నారంతా.
ఇప్పటికే ఆ డేట్ కి రవితేజ ఇరుముడి అనౌన్స్ చేసారు. ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 21 నుంచి నేచురల్ స్టార్ సినిమా తప్పుకుంటే సెప్టెంబర్ 25న థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డేట్‌ని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందుగా మూవీ టీమ్ ఓవర్సీర్ డిస్ట్రిబ్యూటర్స్‌కి కీ అప్డేట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 24 నుంచే ది ప్యారడైజ్ ప్రీమియర్స్ ఉంటాయనే న్యూస్ హల్చల్ చేస్తోంది. మరి ప్యారడైజ్ సినిమా కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎంత త్వరగా క్లారిటీ ఇస్తారో చూడాలి. అసలు పారడైజ్ తో నాని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పాన్ ఇండియా వైబ్స్ ఊహించుకుంటే వాయిదాల మీద వాయిదాలు నిరాశలో నెడుతున్నాయి.
Also Read : Zainab Ravdjee : మొదటిసారి భార్యతో సినిమా ఈవెంట్లో అఖిల్.. అయ్యగారే నెంబర్ వన్ అంటూ జైనబ్ రవ్జీ..
